తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అబ్బాస్ ఒకరు. ఈయన తన కెరియర్లో చాలా తమిళ సినిమాలలో కూడా నటించాడు. అలాగే తెలుగు సినిమాలను కూడా నటించాడు. ఈయన నటించిన కొన్ని తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ మధ్య కాలంలో అబ్బాస్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇది ఇలా ఉంటే పైన ఫోటోలో అబ్బాస్ పక్కన ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? అబ్బాస్ తో పైన ఫోటోలో ఉన్న చిన్న పిల్లడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించాడు.

కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ నటుడు ఇప్పటివరకు నేరుగా తెలుగు ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాలు సాధించాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇంతకు పైన ఫోటోల అబ్బాస్ తో పాటు ఉన్న చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు ... తమిళ క్రేజీ నటుడు జై. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జర్నీ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ అటు తమిళ్ ఇటు తెలుగు రెండు భాషలలో కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈయనకు తమిళ్ తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ఈయన హీరో గా నటించిన రాజా రాణి సినిమా కూడా అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో ఈ నటుడి క్రేజ్ తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: