సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అందాల భామల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలకు కాజల్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2020లో వ్యాపారవేత్త, తన చిరకాల ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను కాజల్ వివాహం చేసుకుంది. కొంతకాలానికే ఈ దంపతులకు నీల్ కిచ్లూ అనే కుమారుడు జన్మించారు.


వివాహం తర్వాత కూడా కాజ‌ల్ త‌న యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగించింది. కానీ సరైన హిట్స్ లేకపోవడంతో ఆమె మార్కెట్ అనేది డౌన్ అయింది. దీనికి తోడు ప్రెగ్నెన్సీ కారణంగా కాస్త బరువు పెరిగింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా కాజల్ గ్రాఫ్ ను పెంచలేకపోయాయి. అయితే ఈమధ్యే కాజల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గట్టిగా కసరత్తులు చేస్తూ బరువు తగ్గి మునుపటి ఫిజిక్ ను సంపాదించుకుంది. మళ్లీ అవకాశాల కోసం వేట మొదలుపెట్టింది.


అయితే కాజల్ డెడికేషన్ చూసి నెటిజ‌న్లు తెగ ముచ్చట పడ్డారు. నాలుగు పదుల వయసులో కూడా బరువు తగ్గి మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవ్వడం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఇక్కడే కాజల్ కోపం కట్టెలు తెంచుకుంది. నెటిజ‌న్ల‌ ప్రశంసల సంగతి పక్కన పెడితే.. ఏజ్‌ ప్రస్తావన తీసుకురావడం కాజ‌ల్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్ర‌మంలోనే 40 ఏళ్లు నిండితే అంతా ముగిసిపోయినట్టు కాదు. ప్రతిభకు వయసు అడ్డకే కాదు. ఇకపై ఏజ్ గురించి మాట్లాడొద్దు అంటూ కాజల్ తన ఆగ్రహాన్ని బయటపెట్టింది. అయితే కాజల్ అసహనం పట్ల నెటిజ‌న్లు రివర్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. మ‌రీ టూ మచ్ ఇది.. అంత చిన్న మాటకే ఇంత కోపమా.. వాస్తవాలను అంగీకరించడం నేర్చుకో అంటూ కాజల్‌కు హిత‌వు ప‌లుకుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: