పాపం.. ఏ ముహూర్తాన అల్లు అర్జున్ - అట్లీ సినిమాకి కమిట్ అయ్యాడో తెలియదు కానీ ఆయనకు ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు ఎంతలా మారుమ్రోగిందో అందరికీ తెలిసిందే. ఆయన పేరుకు ఎంత పాజిటివ్ వచ్చిందో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. “పుష్పరాజ్ క్యారెక్టర్‌లో లీనమై ప్రదర్శన ఇచ్చాడు.. ఆ క్యారెక్టర్ ఆయనకు ఇంకా దిగలేదనిపిస్తోంది” అంటూ చాలామంది ఘాటు కామెంట్లు చేశారు. ముఖ్యంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన తర్వాత అల్లు అర్జున్‌ను పర్సనల్‌గా అటాక్ చేసి మరీ ట్రోల్స్ చేశారు. ఆ కారణంగా ఆయన ఒక రాత్రంతా జైలులో గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.


ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఓవర్ అయ్యే విధంగా మాట్లాడడం కానీ, బిహేవ్ చేయడం కానీ చేయడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయిన బన్నీ.. ఆ సినిమాను క్యాన్సిల్ చేసి మరీ అట్లీ సినిమాకు ఓకే చెప్పారు. “త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్” అంటే ఎంత స్పెషల్ అనేది అందరికీ తెలిసిందే. ఆ కాంబో ఎందుకు క్యాన్సిల్ అయిందంటూ అప్పట్లో రకరకాలుగా జనాలు మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసిన బన్నీకి భారీ బొక్క పడబోతోందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బన్నీఅట్లీ సినిమా మీద ఒక పెద్ద సమస్య వచ్చిందనే వార్త టాలీవుడ్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.



ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం డిఫరెంట్ వేరియేషన్స్ ఇవ్వాలి. అలాంటి రోల్‌ను అల్లాటప్ప నటులు చేయలేరు. కేవలం బిగ్ స్టార్స్ మాత్రమే చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరోని అడిగితే, ఆయన “నేను చేయను” అంటూ స్పష్టంగా చెప్పేసారట. దీంతో అల్లు అర్జున్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆయనకు చాలా క్లోజ్ అయిన హీరో కూడా ఈరోల్ “చేయను” అని చెప్పడం ఇబ్బందికరంగా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని హీరో ని అడిగితే కూడా నో చెప్పారట. దీంతో అట్లీ పరువు పోయిన్నట్లైంది. ఇక బాలీవుడ్ నుండి ఈ రోల్ ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. బన్నీ లాంటి బిగ్ హీరోఅట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ ఇద్దరి కాంబోలో ఒక రోల్ చేయమంటే, ఏ నటుడు కూడా అంగీకరించకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడు ఆ రోల్ ఏమవుతుంది? అలాగే తీసేస్తారా? లేక ఆ రోల్ కి సరిపడే మరో ఆప్షన్‌ని వెతికి సినిమా పూర్తిచేస్తారా? అనేది బిగ్ డౌట్. ఇలా అల్లు అర్జున్అట్లీ కాంబోకి కొత్త కష్టం వచ్చిందంటూ సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, “ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించే నాధుడే లేడా?” అంటూ వెటకారంగా కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: