తెలుగు సినీ పరిశ్రమలో అందగాడిగా , మన్మధుడుగా పేరు తెచ్చుకున్న వారిలో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. నాగార్జున 1959 వ సంవత్సరం ఆగస్టు 29 వ తేదీన జన్మించాడు. ఈ రోజు నాగార్జున పుట్టిన రోజు. నాగార్జున ఈ రోజుతో 66 సంవత్సరాల లోకి ఎంట్రీ ఇచ్చాడు. 66 సంవత్సరాల వయస్సు కలిగిన నాగార్జున ఇప్పటికి యంగ్ కుర్రాడిగా కనబడుతూ ఉంటాడు. అలాగే కుర్రాళ్ళు వేసుకునే స్టైల్ లో డ్రస్సులను వేసుకుంటూ ఉంటాడు. అవి కూడా తనకు అద్భుతంగా సూట్ అవ్వడంతో ఎక్కువ శాతం నాగార్జున స్టైలిష్ లుక్ లో ఉన్న దుస్తులనే ధరిస్తూ ఉంటాడు.

ఇకపోతే నాగార్జున 66 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా కుర్రాళ్లకు పోటీ ఇచ్చే రేంజ్ లో అందంగా కనబడడానికి ఆయన ఎన్నో గంటల పాటు జిమ్ లో కష్టపడతాడు అని , ఆయన వ్యాయామం , ఫుడ్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నాగార్జున మాత్రం ఫుడ్ విషయంలో ఎలాంటి డైట్ ఫాలో కాడట. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా మీరు ఇంత వయస్సు వచ్చిన ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటి ..? మీరు చాలా వ్యాయామం , ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారా ..? అలాగే ఫుడ్ విషయంలో అనేక కండిషన్స్ పెట్టుకుంటారా ..? అనే ప్రశ్న ఎదురయింది.

దీనికి నాగార్జున సమాధానం ... ఇస్తూ నేను అందంగా కనిపించడానికి పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. నేను ఫుడ్ వేషంలో అస్సలు వెనకడుగు వేయను.  నచ్చిన ఫుడ్ ను నచ్చిన విధంగా తింటూ ఉంటాను. ఫుడ్ విషయంలో నేను అస్సలు కండిషన్స్ పెట్టుకొను. నాకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాను. కానీ నేను తిన్న ఆహారాన్ని కలిగించే విషయంలో మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాను. అదే నా అందం యొక్క సీక్రెట్ అని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పకచ్చాడు. ఇకపోతే నాగార్జున తాజాగా కూలీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: