
మెగా అభిమానులు, అల్లు అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల అభిమానుల్లో హీట్ పెరిగింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ తమ హద్దులు దాటి ప్రవర్తించలేదు; “ఎవరి సినిమాలు వాళ్లవే” అంటూ అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ పనిలో తాము మునిగిపోయారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల అల్లు అరవింద్ గారి తల్లి, అల్లు అర్జున్ నానమ్మగారు, రామ్ చరణ్ అమ్మమ్మగారు అయిన అల్లు కనకరత్నం గారు కన్నుమూశారు. అన్ని కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు అందరూ కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి పెద్దదిక్కుగా నిలిచి కార్యక్రమాలను పూర్తి చేశారు. కష్టకాలంలో పిలుపు లేకపోయినా మనవాళ్లు వచ్చి తోడ్పడతారనే విషయాన్ని ఇది మరోసారి రుజువు చేసింది.
సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు నిన్న మొన్నటి వరకు మాటల యుద్ధంతో విపరీతంగా అల్లకల్లోలంగా ఉన్నారు. మెగా అభిమానులు “రామ్ చరణ్ టాప్” అని, అల్లు అభిమానులు “అల్లు అర్జున్ కేక” అని కౌంటర్లు వేసుకున్నారు. కానీ హీరోలు మాత్రం అందరూ ఒకే చోట కలిసి ఆ కుటుంబానికి అండగా నిలిచి అన్ని బాధ్యతలు నిర్వర్తించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి ఎంతో క్లోజ్‌గా, కలిసి ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేశారు. దీంతో సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ, ఇకనైనా అభిమానులు గొడవలు పెట్టుకోవడం, మాటల యుద్ధాలు ఆపడం మంచిదని సూచించారు. “వాళ్లు ఎప్పటికీ ఒకే కుటుంబాలు గొడవలు వస్తాయి, సర్దుకుపోతాయి. కష్టకాలంలో అందరూ కలిసి ఉంటేనే అది నిజమైన కుటుంబం” అని చెప్పుకొచ్చారు. “అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇక మాట్లాడుకోరు, వారిద్దరి మధ్య దూరం పెరిగింది” అంటూ రూమర్స్ సృష్టించే వాళ్లు నోరు మూసుకొని తమ పనులు చూసుకోవడం మంచిదని సినీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ నాయకులను కూడా నెటిజన్లు టార్గెట్ చేస్తూ, “మీ రాజకీయాలను మీ దగ్గరే పెట్టుకోండి” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. రాజకీయనాయకులు ఏదో అనుకున్నారు..కానీ మెగా-అల్లు ఫ్యామిలీ కలిసిపోయింది వాళ్లు అనుకున్న సీన్ మొత్తం రీవర్స్ అయ్యిపోయింది..!!