రష్మిక మందన్నాను సోషల్ మీడియాలో ఎప్పుడూ టార్గెట్ చేయడమే ఫ్యాషన్‌లా మారిపోయిందని చెప్పడంలో సందేహమే లేదు. ఏ విషయమైనా, అది అవసరమా కాదా అనే విషయం పట్టించుకోకుండా కొంతమంది నెటిజన్లు రష్మికపై ట్రోలింగ్ మొదలుపెడతారు. చిన్న తప్పు జరిగినా, అనవసరమైన ఇష్యూల్లోనూ ఆమెను లాగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా కూడా అదే సీన్ రిపీట్ అయింది. మనందరికీ తెలిసిందే, టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన "గామా" అవార్డ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ అవార్డ్స్‌లో నామినేట్ కావడం అంటేనే ఒక గౌరవంగా భావిస్తారు, గెలిస్తే మరి మాటల్లేకుండా ప్రత్యేక గుర్తింపు లభించినట్టే. ఇప్పటివరకు ఈ గామా అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జువెలరీ సమర్పణలో జరిగిన ఐదో ఎడిషన్ వేడుకలు దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఎంతో గ్రాండ్‌గా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.


ఈ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్‌ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో, సీఈవో సౌరభ్ కేసరి గారి సహకారంతో ఈ వేడుక ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ గామా అవార్డ్స్ 2024లో బెస్ట్ యాక్టర్ అవార్డును ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో తన అద్భుత నటనకు గాను అల్లు అర్జున్ గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ హీరోయిన్ అవార్డును ‘లక్కీ భాస్కర్’ సినిమాలో తన అద్భుత ప్రదర్శనకు గాను మీనాక్షి చౌదరి అందుకున్నారు. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు సుకుమార్ గారికి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దేవి శ్రీ ప్రసాద్ గారికి దక్కాయి. ఈ అవార్డుల జాబితాలో ‘పుష్ప 2’ సినిమాకు కూడా పలు పురస్కారాలు లభించాయి.


అయితే ఈ అవార్డుల వేడుక తర్వాత సోషల్ మీడియాలో రష్మిక మందన్నాపై విమర్శలు వెల్లువెత్తాయి. పుష్ప సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు అవార్డు రాకపోవడాన్ని చాలామంది ఎత్తి చూపారు. హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమా టీమ్‌కి గుర్తింపు వచ్చినా, సినిమాలో పుష్ప రాజు భార్య శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మికకు మాత్రం అవార్డు రాకపోవడంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొంతమంది నెటిజన్లు రష్మిక నటనను విమర్శిస్తూ, ఆమెకు నటనలో నైపుణ్యం లేదని, కేవలం గ్లామర్‌పై మాత్రమే దృష్టి పెడతారని కామెంట్లు చేస్తున్నారు. “శ్రీవల్లి పాత్రకు ఉన్న ఇంపాక్ట్‌కి తగ్గ అవార్డు ఇవ్వకపోవడం సరైంది కాదు” అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో రష్మికను మళ్లీ టార్గెట్ చేస్తూ మీమ్స్, పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొత్తానికి, పుష్ప 2 సినిమాతో టాలీవుడ్ సక్సెస్ స్టోరీలో కొత్త పేజీ రాసుకున్నప్పటికీ, రష్మిక మందన్నాపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్ల వర్షం మాత్రం ఆగడం లేదు. గామా అవార్డ్స్ వేడుకలో ఆమెకు బెస్ట్ హీరోయిన్ అవార్డు రాకపోవడమే ఈ చర్చకు కారణమైంది. సినీ అభిమానులు, నెటిజన్లు దీనిపై రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రష్మిక ప్రతిభను ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ అవకాశాన్ని ఆమెను విమర్శించడానికి ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వివాదం బాగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: