గత ఐదు దశాబ్దాల్లో గోదావరి నుంచి ఒక లక్ష టీఎంసీల నీరు సముద్రంపాలైందని పేర్కొన్నారు. పోలవరం దగ్గర వరదనీరు సద్వినియోగం చేసుకోకపోతే అదంతా సముద్రంలో కలిసిపోతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద నీటిని సంరక్షించి రెండు రాష్ట్రాల రైతులకు సాగునీరు అందించవచ్చని సూచించారు.మంత్రి నిమ్మల రామనాయుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.
గోదావరిలో నీరు పుష్కలంగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చామని చెప్పారు. అదే విధంగా పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి సరిపడా నీరు మిగిలితే తెలంగాణ కూడా దాన్ని వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగునీటి లభ్యత పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా అదనపు నీరు అందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు ఈ అంశంపై స్పష్టత ఇస్తూ రెండు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి