పవర్ స్టార్, జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారిపోయిన పవన్ కళ్యాణ్ గురించి కొత్త పరిచయాలు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం.. పవన్ ఏం చేసినా అది హైలైట్ అవుతుంది. రేణు దేశాయ్, అన్నా లెజ్నెవా గురించి అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ మళ్లీ రీసెర్చ్ చేస్తున్నారు.


1996లో అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, కెరీర్ మొదట్లోనే సినిమాలకే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. 1997లో పెద్దల సమక్షంలో విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పవన్ వివాహం చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. వ్యక్తిగత కారణాలు, చిన్న చిన్న మనస్పర్థల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ తన కెరీర్, ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయారు. కానీ నందిని మాత్రం మరో మార్గం ఎంచుకుంది. విడాకుల తర్వాత కొన్ని సంవత్సరాలు తక్కువగా బయట కనిపించిన ఆమె, 2010లో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఓ ఎన్నారై డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకొని తన పేరు కూడా మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ కాకుండా, పవన్ గ్లామర్ లైఫ్‌కి దూరంగా సైలెంట్‌గా జీవిస్తున్నారట.



ఇక పవన్ కళ్యాణ్ మాత్రం 2007లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. రేణుతో ఉన్నప్పుడు అకిరా నందన్ అనే కుమారుడు పుట్టాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి విడాకులు ఇచ్చి, రష్యన్ బ్యూటీ అన్నా లెజ్నెవాను మూడోసారి వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.అంటే పవన్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నా, ఆయన పబ్లిక్ ఇమేజ్ మాత్రం ఎప్పుడూ బలంగానే నిలిచింది. హీరోగా, నాయకుడిగా ఆయనకున్న క్రేజ్ వేరు. కానీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడూ ఇలాంటివి గూగుల్ చేసి, పవన్ మొదటి భార్య ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: