టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటు వంటి రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తో కూడా విజయాన్ని అందుకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రపంచ స్థాయి లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ఓ మూవీ ని రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రపంచ స్థాయిలో అంచనాలు భారీ ఎత్తున నెలకొని ఉన్నాయి.

తాజాగా రాజమౌళి , కెన్యా ప్రధాని అయినటువంటి ముసాలియా మూదావాదిని కలిశాడు. అనంతరం అక్కడి మంత్రి అందుకు సంబంధించిన ముఖ్యంశాలను తెలియజేశాడు. రాజమౌళి ఎంతో శక్తివంతమైన దర్శకుడు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన తర్వాత రాజమౌళి కి సంబంధించిన 120 మంది తో కూడిన బృందం ఆయన సినిమా షూటింగ్ కోసం కెన్యా ను ఎంచుకుంది. ఈ మూవీ ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు ఈ మూవీ బృందం ప్లాన్ చేస్తుంది.

సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది కి చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మూవీ కావడం , ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అద్భుతమైన స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ఆస్కార్ అవార్డ్ కూడా రావడంతో ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: