టాలెంటెడ్ న‌టి అనుపమ పరమేశ్వరన్ ను సౌత్ సినీ ప్రియుల‌కు కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. 2015లో `ప్రేమమ్` మూవీతో త‌న యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన అనుప‌మ‌.. `ఆఆ`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `శతమానం భవతి`, `హలో గురు ప్రేమ కోసమే` వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. అటు త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌ని చేస్తూ పాపుల‌రిటీ సొంతం చేసుకుంది. నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉన్నా, స్టార్ హీరోయిన్ స్థాయి మాత్రం అనుప‌మ‌కు దక్కలేదు.


అయితే స‌మంత వ‌ల్లే అనుప‌మ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది అనే టాక్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో ఉంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట అనుప‌మ‌ను ఎంపిక చేశారు. కానీ, ఆఖర్లో స‌మంత ఫిక్స్ అయ్యింది. ఈ విష‌యాన్ని గ‌తంలో సుకుమార్ స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు.


రంగ‌స్థ‌లంలో సమంత పోషించిన‌ `రామలక్ష్మి` పాత్ర ఆడియెన్స్‌కు బాగా న‌చ్చేసింది. పైగా సినిమా బ్లాక్‌బస్టర్ కావ‌డంతో సమంత కెరీర్‌లో మ‌రొక పెద్ద హిట్ ప‌డింది. ఒకవేళ రంగస్థలం వంటి భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా న‌టించి ఉండుంటే అనుప‌మకి భారీ స్టార్డమ్ ద‌క్కేది. ఆమె కెరీర్ మ‌రింత ఎత్తుకి వెళ్లేది. కానీ ఆ అవకాశం జారిపోవడంతో, ఆమె మ‌ధ్యస్థాయి హీరోయిన్‌గానే మిగిలిపోయింది. ఈ విధంగా అనుప‌మ స్టార్ హీరోయిన్ స్థాయి చేరలేకపోవడానికి ప‌రోక్షంగా స‌మంతే కార‌ణ‌మైంది.


ఇకపోతే అప్ప‌ట్లో రంగస్థ‌లం మూవీని అనుప‌మ‌నే కావాల‌ని రిజెక్ట్ చేసింద‌ని మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. ఈ ప్ర‌చారం కార‌ణంగా అనుప‌మ దాదాపు ఆరు నెల‌ల పాటు మ‌రే సినిమాల్లో అవ‌కాశాలు రాక న‌ర‌కం చూసింద‌ట‌. తాజాగా ఈ విషయాన్ని `కిష్కింధపురి` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో అనుప‌మ వెల్ల‌డించింది. కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ జంట‌గా న‌టించిన హార‌ర్ థ్రిల్ల‌ర్‌ కిష్కింధపురి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: