టాలెంటెడ్ యాక్ట్ర‌స్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇటీవ‌లె `పరదా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. నెల రోజులు తిర‌క్క ముందే మ‌రో సినిమాతో థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు అనుప‌మ సిద్ధ‌మైంది. ఈ బ్యూటీ నుంచి రానున్న లేటెస్ట్ ఫిల్మ్ `కిష్కంధ‌పురి`. కౌశిక్ పెగ‌ల్ల‌పాటి డైరెక్ట్ చేసిన ఈ హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా న‌టించారు. అనుప‌మ క‌థానాయిక‌. సెప్టెంబ‌ర్ 12న కిష్కంధ‌పురి రిలీజ్ కాబోతుంది.


తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ తో మూవీపై మంచి హైప్ వ‌చ్చేసింది. ప్ర‌మోష‌న్స్ ద్వారా చిత్ర‌బృందం మ‌రింత బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అనుప‌మ‌.. డైరెక్ట‌ర్ కౌశిక్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కౌశిక్ త‌న‌ను టార్చ‌ర్ పెట్టాడంటూ వ్యాఖ్యానించింది. అయితే ప‌ర్స‌న‌ల్‌గా కాదండోయ్‌.. వ‌ర్క్ విష‌యంలో అనుప‌మ‌ను టార్చ‌ర్ చేశాడ‌ట‌.


అనుప‌మ మాట్లాడుతూ.. `నాకు మూడేళ్ల వయసు నుంచి హారర్ మూవీస్ చూడడం అలవాటు. హారర్ జోనర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కౌశిక్ కిష్కంధ‌పురి కథ చెప్పగానే బాగా నచ్చేసింది. అతను చెప్పిన ఫ్లో బాగుంది. స్క్రిప్ట్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నాడ‌ని అప్పుడే నాకు అర్థ‌మైంది. కౌశిక్‌తో కలిసి వర్క్ చేయడం అద్భుతంగా అనిపించింది. ఇక డ‌బ్బింగ్ స్టూడియోలో కౌశిక్ అంతలా నన్ను టార్చర్ చేసిన తెలుగు డైరెక్టర్ మరెవరూ లేరు` అంటూ నవ్వుతూ అనుపమ చెప్పుకొచ్చింది ప్రస్తుతం అనుపమ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా, ప‌ర‌దాతో ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచిన అనుప‌మ‌.. కిష్కంధ‌పురితో క‌చ్చితంగా హిట్ కొట్టాల‌ని ఆశ ప‌డుతుంది. మ‌రి ఆమె ఆశ తీరేనా? లేదా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: