సాధారణంగా స్టార్ హీరోయిన్ అనుష్కపై ట్రోలింగ్ అనేది జరగదు. అలా ట్రోల్లింగ్ జరిగేది చాలా రేర్. ఫింగర్ కౌంటింగ్స్ అని చెప్పాలి. ఆమె ఏం చేసినా అభిమానులు సపోర్ట్ చేస్తారు, ఈ విషయం అందరికీ తెలుసు. అనుష్క అంటేనే ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం కలిగిన హీరోయిన్ అని అభిమానులు భావిస్తారు. అనుష్క ఏ పాత్ర చేసినా దానికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అభిమానుల అభిప్రాయం. అలాంటి అనుష్క నటించిన "ఘాటి" సినిమాలో ఆమె నటన, క్యారెక్టర్‌పై మాత్రం జనాలు మండిపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, ఇలాంటి ట్రోలింగ్‌ను అనుష్క తన కెరీర్‌లో ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదు.


గతంలో అనుష్క ఎన్నో సినిమాల్లో రిస్క్‌లు చేసింది. ముఖ్యంగా "వేదం" సినిమాలో ఆమె చేసిన వ్యభిచారి పాత్రను ప్రేక్షకులు ఎంకరేజ్ చేశారు. కానీ ఈ సినిమాలో కనిపించిన శీలావతి పాత్రను మాత్రం జనాలు లైక్ చేయలేకపోయారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది అనుష్క నటనను మెచ్చుకుంటే, మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. “అనుష్క ఇంత వైలెంట్‌గా ఎలా నటించగలదు?” అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటంటే, అనుష్క అంటే సాఫ్ట్ నేచర్, రొమాన్స్ పాత్రలు చేయాలి. అప్పుడప్పుడు కత్తి పట్టుకొని యుద్ధ సన్నివేశాలు చేయాలి, మెసేజ్ ఓరియంటెడ్ పాత్రలు చేయాలి..అంతే.  అనుష్క కి ఆ రేంజ్ ఉంది అభిమానుల మనసుల్లో.

 

“ఇలాంటి ఊర నాటు మాస్ పాత్రలు నీకు సెట్ కావు” అని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మరీ హద్దులు మీరి పాత సామెతలను అనుష్క ఘాటీ సినిమా పేరుతో ముడిపెడుతున్నారు: “కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎవరి పని వాళ్లు చేస్తేనే బెటర్. నీ బాడీకి సూట్ అయ్యేది నార్మల్ క్యారెక్టర్స్. ఇంత వైలెన్స్ నీకు సెట్ కాదు. ఇక ఇలాంటి సాహసాలు చేయడం ఆపేయి అనుష్క” అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఘాటీ విషయంలో అనుష్క ఏదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యింది. చూడాలి మరి దీనిపై అనుష్క ఎలా స్పందిస్తుందో..!?

మరింత సమాచారం తెలుసుకోండి: