ఓ ఇద్దరు ఆడ , మగ మధ్య ప్రేమ చిగురించడానికి వయస్సు ప్రధాన కారణం కాదు. కొన్ని కారణాల వల్ల ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఏర్పడి , అది ప్రేమకు దారి తీయవచ్చు. అలా దారి తీసాక వారి వయస్సు తేడా ఎంత ఉంది అనేది సమాజం గమనిస్తుంది. కానీ ప్రేమకు వయస్సు హద్దులు కావు. కానీ సమాజం మాత్రం వారిద్దరి మధ్య వయస్సు తేడా ఎక్కువగా ఉంది. దానితో వారి మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని అనడం , ఆ తర్వాత అవి ఆజంట వరకు చేరిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేదే ఇక్కడ ప్రధాన కారణం. ఇకపోతే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి ప్రేమ కథ ఒకటి జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... అతను రైటర్. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆమె ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న యంగ్ అమ్మాయి. వయసు 22 సంవత్సరాలు. ఇక వీరిద్దరూ ఒకే రంగం లో పని చేయడంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది. కానీ వీరిద్దరి మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉంది. ఆ రైటర్ జన్మించిన తర్వాత 20 సంవత్సరాలకు ఆమె పుట్టింది. అంటే వీరిద్దరి వయసు మధ్య 20 సంవత్సరాల తేడా ఉంది.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లో అనేక ప్రేమ కథలు చిగురిస్తూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళతాయి. కొన్ని ప్రేమ గానే ఆగిపోతాయి. మరి 42 సంవత్సరాల వయస్సు గల రైటర్ , మరి 22 సంవత్సరాల యంగ్ ఆర్ట్ డైరెక్టర్ అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా ... లేక ఏమైనా కారణాల వల్ల ప్రేమ ఆగిపోతుందా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ప్రేమ చిగురించడానికి వయసు సమస్య కాదు. అలాగే వయస్సు తేడా వల్ల విడిపోవడం అస్సలు కరెక్ట్ కాదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: