నయనతార .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. నయనతార అంటే చాలామందికి ప్రత్యేకమైన అభిమానం. ఆమె ఎంచుకునే సినిమాల్లో కంటెంట్ బాగుంటుందని, ఆమెను "లేడీ టైగర్" అని పిలుస్తూ రకరకాలుగా పొగుడుతుంటారు. అయితే ఇది నయనతారలో ఒక కోణం మాత్రమే. ఆమెలో ఇంకో తెలియని కోణం ఉందని, అది పూర్తిగా నెగిటివ్ అని, వేరే హీరోయిన్స్ ఎదగనీయదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం గతంలో హీరోయిన్ మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మమతా మోహన్ దాస్ నయనతార గురించి చేసిన వ్యాఖ్యలే.


మమతా మోహన్ దాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచితురాలు. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. గతంలో క్యాన్సర్‌ను జయించి ఆరోగ్యవంతురాలైన మమతా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మమతా మోహన్ దాస్ నయనతార గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరు పొందిన నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "నయనతార చేసిన పనికి నేను చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చింది.



ఆమె మాట్లాడుతూ.. “రజనీకాంత్‌తో ఒక సినిమాలో చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందపడ్డాను. అందులో ఓ పాట కోసం చిత్రబృందం నన్ను సంప్రదించారు. నేను రజనీకాంత్‌కి పెద్ద అభిమాని. ఆ పాట ఆఫర్ రాగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ పాటను నాలుగు రోజులు షూట్ చేశాం. షూట్ చేస్తున్నప్పుడే ఫ్రేమ్‌లో నేను లేనట్టు అనిపించింది. ఫైనల్ కాపీ బయటకు రాగానే నా షాట్స్ లెపేశారు. ఎక్కడో ఒక షాట్‌లో దూరంగా మాత్రమే కనిపించాను. నాకు చెప్పిన విధంగా ఆ పాటను ఉపయోగించలేదని అర్థమైంది. దీనికి కారణం నయనతార అని తర్వాత తెలిసింది. ఆ పాటలో వేరే హీరోయిన్ ఉంటే నేను చేయను అని నయనతార చెప్పేసిందట. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందని తనకి చెప్పలేదని తెలిసింది. అందుకే ఆ పాటను అలా చిత్రీకరించారట. ఆ పాట కోసం నేను పడిన కష్టం మొత్తం వృథా అయిపోయింది. చాలా బాధ కలిగింది” అంటూ మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మమతా మోహన్ దాస్ భావోద్వేగంగా చెప్పింది.



సినిమా ఏంటో అనుకుంటున్నారా? రజనీకాంత్-నయనతార కాంబోలో వచ్చిన ‘కథానాయకుడు’. 2008లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మమతా మోహన్ దాస్ మెరిసింది. ఆ చిత్రంలోని ‘దేవుడే స్వర్గం నుంచి’ అనే పాటలో అలా కనిపించి ఇలా మాయమైపోయింది. అప్పట్లో మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మమతా మోహన్ దాస్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. దీంతో నయనతారపై "జగత్ కంత్రీ" అంటూ చాలామంది నెటిజన్లు ఘాటుగా కౌంటర్లు వేశారు. “నయనతార అంతే… వేరే హీరోయిన్స్‌ను ఎదగనివ్వదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ బాగా ట్రోల్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: