కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తాజాగా మదరాసి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటించగా ... ఏ ఆర్ మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంలో శివ కార్తికేయన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించాడు. అలాగే తెలుగులో ఎన్నో ఇంటర్వ్యూ లను ఇచ్చాడు.

ఇక తెలుగు ఇంటర్వ్యూ లో భాగంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యింది. తాజాగా మదరాసి మూవీ లో హీరో గా నటించిన శివ కార్తికేయన్ హీరోయిన్గా నటించిన రుక్మిణి వాసంత్ తెలుగు లో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. మీరు చేసిన సినిమాలో ఒక వేల తెలుగు హీరో ఎవరైనా క్యామియో పాత్ర చేయవలసి వస్తే మీ సినిమాలో ఎవరి చేత క్యామియో పాత్ర వేయిస్తారు అనే ప్రశ్న శివ కార్తికేయన్ కి ఎదురయింది. దీనికి శివ కార్తికేయన్ , జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చాడు. దానితో యాంకర్ రుక్మిణి వాసంత్ ను కూడా మీ సినిమాలో ఎవరు క్యామియో పాత్ర చేస్తే బాగుంటుంది అని అడగ్గా ఆమె కూడా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది.

ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో భాగంగా రుక్మిణి వసంత్ కి మీరు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆమె అవును అనే విధంగా సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk