చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే డిగ్రీలు , పీజీలు పూర్తి చేసినవారు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయం లో కొంత మంది ఉద్యోగాల కోసం ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని ఆ కంపెనీ కి వెళ్లి వారికి సంబంధించిన ఫైల్స్ ను ఇచ్చి వచ్చేవారు. అలాగే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవారు. ఇక అక్కడ , ఇక్కడ ప్రకటనలను చూసి ఉద్యోగాలకు కోసం వెళ్లేవారు. ఇలా ఒక ఉద్యోగం తెచ్చుకోవడం కోసం , ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసం యువత ఎంతో కష్టాన్ని ఎదుర్కొనేది.
ఇక ప్రస్తుతం ఆ కష్టాలు లేవు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అనేక ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లలో మన రెజ్యూమ్ ను అప్లోడ్ చేసినట్లయితే మన రెస్యూమ్ కు సంబంధించిన ఉద్యోగాలు మనకు ఎక్కడ ఉన్నాయి అనే దానిని అదే మనకు చూపిస్తుంది. ఆ తర్వాత మన స్కిల్ కి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో వారు మనల్ని అప్రోచ్ అవుతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు చేయడం , ఇవన్నీ ప్రాసెస్ తర్వాత మనకు ఉద్యోగం ఇవ్వడం , లేనిది అనేది డిసైడ్ అవుతుంది. ఇకపోతే ఈ సర్వీస్ లో ప్రస్తుతం అద్భుతమైన దశలో ముందుకు సాగిపోతున్న వాటిలో లింక్డ్ ఇన్ ప్లాట్ ఫామ్ ఒకటి.
లింక్డ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో ఎంతో మంది తమ రెస్యూమ్ ను అప్లోడ్ చేసి ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. ఇకపోతే లింక్డ్ ఇన్ లో ఫేక్ సభ్యుల సంఖ్య భారీ గా పెరిగిపోవడంతో దీనిని అరికట్టేందుకు లింక్డ్ ఇన్ సంస్థ భారీ మార్పులు , చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో అసలు ఫేక్ వ్యక్తులు అనే వారే లింక్డ్ ఇన్ ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లో లేకుండా చేసే విధంగా ఈ సంస్థ ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో లింక్డ్ ఇన్ సంస్థలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వారికి ఫేక్ వ్యక్తుల సమస్య అసలు ఉండదు అని తెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: