సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. వాళ్ల సినిమాలు, వ్యక్తిగత జీవితం, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అన్నీ ఎప్పటికప్పుడు పబ్లిక్ డిస్కషన్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఒక షాకింగ్ ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆ ప్రిడిక్షన్ చెప్పింది ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి.


వేణు స్వామి గతంలో ఎన్నో స్టార్ సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్పి, అందరికి షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ పక్కా సక్సెస్ అవ్వడంతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. పెళ్లిళ్లు, విడాకులు, కెరీర్‌లో వచ్చే మార్పులు, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో విషయాలను ముందుగానే చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. “ఒక బిగ్ హీరోయిన్, ఒక యావరేజ్ హీరో త్వరలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతారు. అనారోగ్య కారణాల వల్ల పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే ఎవరు ఆ హీరో? ఎవరు ఆ హీరోయిన్? అనే విషయాలను మాత్రం ఆయన బయట పెట్టలేదు.



అప్పుడు ఈ విషయం చాలా మందికి నమ్మశక్యంగా అనిపించలేదు. “ఇలాంటి ఊహాగానాలు చెప్పడం ఆయన అలవాటు, ఇవన్నీ ఫేక్ ప్రిడిక్షన్స్ మాత్రమే” అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆయన మాటలను సరదాగా తీసుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ ప్రిడిక్షన్ వైపు జనాల దృష్టిని మళ్లిస్తున్నాయి. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తన ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆయనకు ఉన్న అనారోగ్యం సాధారణం కాదని కొన్ని న్యూస్ చానల్స్  రాసాయి. ఈ హీరో గత నాలుగు నుండి ఐదు నెలలుగా దేశం దాటి విదేశాల్లోనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఎంత డబ్బు ఉన్నా, ఆయన సమస్య పూర్తిగా తగ్గడం లేదట.



ఇంతవరకు ఈ విషయం పూర్తిగా సీక్రెట్‌గా ఉంచారు. ఆయన ఇమేజ్‌కి డ్యామేజ్ కాకుండా ఉండటానికి మీడియాకు దూరంగా ఈ ట్రీట్మెంట్ జరుగుతోందట. కానీ తాజాగా ఈ న్యూస్ మీడియా కి లీక్ కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. “ఇంత పెద్ద హీరోకి ఈ స్థాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా?” అని షాక్ అవుతున్నారు. ఇక వేణు స్వామి చెప్పిన ఆ మాటలతో ఈ విషయం ముడిపెట్టుకొని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. “ఆ హీరో ఈయనేనా? ఆయన గురించే చెప్పారా? నిజంగానే ఈ పరిస్థితి అంత సీరియస్‌గా ఉందా?” అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమానులు మాత్రం భయపడుతూ “ఇది నిజం కాకూడదు. ఈ వార్తలన్నీ పుకార్లే కావాలి” అని ఆశిస్తున్నారు.



మరోవైపు కొందరు మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. “ఇలాంటి జ్యోతిష్యాలు నమ్మకూడదు. ఆరోగ్య సమస్యలు ఎవరికైనా రావచ్చు. అందుకే ఇది పెద్దది చేయాల్సిన అవసరం లేదు” అని అంటున్నారు. అభిమానులు తమ ప్రియమైన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ వేణు స్వామి చెప్పిన మాటల వైపు తిరిగి చూసేలా ఈ పరిణామాలు మారాయి. ఆ జ్యోతిష్కుడు చెప్పిన ప్రిడిక్షన్ నిజమవుతుందా? లేక ఇవన్నీ కేవలం గాసిప్సేనా? అన్న ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: