
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగగా ఈ ఏడాది వేలంపాటలో బాలాపూర్ లడ్డూ, రిచ్మండ్ విల్లా లడ్డు రికార్డు రేటు పలికింది. అయితే వినాయక చవితి పండగ సమయంలో షూట్ చేసిన షార్ట్ ఫిలిం "లడ్డూ దొంగతనం" తాజాగా యూట్యూబ్ లో విడుదలైంది. ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గణేశుడి భక్తులు ఎంతగానో మెచ్చే విధంగా ఈ షార్ట్ ఫిలిం ఉంది.
18 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలింలో ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రవీణ్, ఇతర నటీనటులు తమ పాత్రల్లో అద్భుతంగా జీవించారు. ఈ షార్ట్ ఫిలింలో డైలాగ్స్ సైతం అదిరిపోయాయి. ప్రధాన నటీనటుల డైలాగ్ డిక్షన్ కొత్తగా ఉండటంతో పాటు అందరినీ మెప్పించేలా ఉంది. ట్రెండ్స్ మచ్చ క్రియేషన్స్ నిర్మాణ విలువలు సైతం అదిరిపోయాయి.
షార్ట్ ఫిలింలో క్లైమాక్స్ ను కొత్తగా ప్లాన్ చేశారు. షార్ట్ ఫిల్మ్ సూపర్ అనేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గణేషుడి లడ్డూ దొంగతనం కాన్సెప్ట్ తో గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కినా వాటిని భిన్నంగా ఈ జనరేషన్ యూత్ కు నచ్చే విధంగా షార్ట్ ఫిలిం ఉంది. అన్న, చెల్లి పాత్రలు ఈ షార్ట్ ఫిలింలో భలే పేలాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతంగా షార్ట్ ఫిలిం ను తెరకెక్కించే విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా టాప్ క్లాస్ లో ఉన్నాయి. ఈ వీకెండ్ కు యూట్యూబ్ లో మంచి షార్ట్ ఫిలిం చూడాలని భావించే వాళ్లకు ఈ షార్ట్ ఫిలిం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఈ షార్ట్ ఫిలిం ఉండటం గమనార్హం.