సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్ మధ్య స్నేహం బంధం ఎక్కువగానే ఉంటుంది. కానీ అభిమానులు చేసే కొన్ని అత్యుత్సాహ పనుల వల్ల ఇబ్బందులకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ వార్ అనేది ఎక్కువగా హీరోల మధ్య ఉంటుంది. తాజాగా హీరోయిన్స్ మధ్య ఈ వార్ కొనసాగుతోంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా పేరు పొందిన దీపికా పదుకొనె, ఆలియా భట్ ఫాన్స్ చేస్తున్న పనికి నెటిజన్లు సైతం అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఇద్దరు కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వీరు తాజాగా ఒక బ్రాండ్ అంబాసిడర్ మార్పు కారణంగా బాలీవుడ్ లో వీరి విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.



ఇన్ని రోజులు అమెరికన్ బ్రాండ్ లెవిస్ కు ప్రచారకర్తగా ఉన్న దీపికాను తొలగిస్తూ తాజాగా ఆ బ్రాండ్ కు ఆలియా భట్ ను ఎంపిక చేశారు. దీంతో దీపికాను తప్పించడంతో ఆమె అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆలియా భట్ పైన ఫైర్ అవుతూ.. గ్లోబుల్ అంబాసిడర్ గా ఉన్న దీపికాను ఎందుకు తొలగించారు?.. ఆమె స్థానంలో ఆలియాను తీసుకోవడానికి గల అర్హతలు ఏమి అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో మరి కొంతమంది ఆలియా దీపికా స్థానాన్ని దొంగలించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆలియా భట్ అసూయాతోనే ఇలాంటి పని చేసిందంటూ ట్విట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


ఈ విషయాలన్నిటికీ కూడా ఆలియా భట్ అభిమానులు దీపికా ఫ్యాన్స్ కి ఎదురు కౌంటర్ వేస్తున్నారు. దీపికా కూడా అంతకుముందు ఉన్న బ్రాండ్ అంబాసిడర్ నుంచి ఆమె లాక్కున్నదే కదా అంటూ తిప్పికొడుతున్నారు! మొత్తానికి లెవిస్ బ్రాండ్ ని ట్యాగ్ చేస్తూ ఈ వివాదాలు విమర్శలతో వైరల్ చేస్తున్నారు. ఆలియా భట్, దీపికా ఇద్దరిలో ఈ వ్యవహారం పైన ఏ ఒక్క ప్రకటన చేయలేదు కేవలం వారి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ చేస్తున్న పనికి మాత్రం..పని లేని వారే ఇలాంటి వివాదాలు సృష్టిస్తుంటారని.. కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: