
1999లో వచ్చిన `ప్రేమ కోసం` మూవీతో ఫ్లోరా సైని తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత `అంతా మన మంచికే`, `మనసున్న మారాజు`, `చాలా బాగుంది`, `చెప్పాలని ఉంది`, `అక్కా బావెక్కడ`, `నరసింహనాయుడు`, `నువ్వు నాకు నచ్చావ్`తో సహా తదితర సినిమాల్లో నటించింది. కెరీర్‌లో ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే పోషించినప్పటికీ.. తన గ్లామర్ మరియు యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నరసింహనాయుడులో `లక్సు పాప లక్సు పాప` పాటతో ఫుల్ ఫేమస్ అయింది. అలాగే `143`లో ఆశా పోషించిన జర్నలిస్ట్ పాత్రకు కూడా మంచి ఆదరణ లభించింది.
తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఫ్లోరా సైని సినిమాలు చేసింది. 2014 నుంచి బాలీవుడ్‌కే పరిమితం అయింది. తాజాగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లో లక్సు పాప ఎన్నో కష్టాలు పడిందట. గుడ్డిగా ప్రేమిస్తే ప్రియుడే ఆమెను మోసం చేశాడట. ఆ చీకటి రోజులను బిగ్ బాస్ షో వేదికగా ఫ్లోరా పంచుకుంది.
20 ఏళ్ల వయసులో ఫ్లోరా ఓ నిర్మాతతో ప్రేమలో పడింది. అప్పటికి పదికి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది. హీరోయిన్ గా మంచి ఫామ్‌లో ఉంది. అలాంటి సమయంలో ఓ ప్రొడ్యూసర్ ప్రేమ పేరుతో ఫ్లోరా లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటినుంచి పరిస్థితులు తారుమారు అయ్యాయి. కొద్ది రోజులకే ఫ్లోరాను ప్రియుడు వేధిండచం స్టార్ట్ చేశాడు. సినిమాల్లోద్దు, యాక్టింగ్ మానేయని బలవంతం చేశాడు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ లాగేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు నరకం చూపించాడు. ముఖంపై, ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసేవాడు.. ఒక రోజు అతను పెట్టే బాధలు భరించలేక తల్లిదండ్రులకు వద్దకు పారిపోయానని.. ఆ తర్వాత మళ్లీ మనిషిగా కోలుకోవడానికి ఎన్నో నెలల సమయం పట్టిందని ఫ్లోరా ఫుల్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.