
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నా అల్లుడు’ సినిమాలో రమ్యకృష్ణ అత్తగారి పాత్రలో కనిపించి, అల్లుడు పాత్రలో ఎన్టీఆర్ స్క్రీన్‌పై అదరగొట్టే ఎంటర్టైన్‌మెంట్ అందించారు. కానీ ఈ జోడీని స్క్రీన్‌పై మరో లెవెల్‌కి తీసుకెళ్లింది ‘సింహాద్రి’ సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి చిందులు వేసింది అందరి మదిలో ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే ఉంది. ఆ సమయంలో రమ్యకృష్ణ వంటి సీనియర్ హీరోయిన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్‌పై జోడి కట్టడమే కాదు, ఆ పాటలో ఇరువురి ఎనర్జీ, డాన్స్ స్టెప్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. రమ్యకృష్ణ తన స్టైల్, గ్రేస్‌తో స్క్రీన్‌పై గ్లామర్‌ని నింపగా, ఎన్టీఆర్ తన ఎనర్జీ, మాస్ అటిట్యూడ్‌తో పాటకు వేరే లెవెల్ ఇచ్చాడు. ఆ పాటలో ఇరువురి కాంబినేషన్ అద్భుతంగా పనిచేసింది. ఫలితంగా, ఆ స్పెషల్ సాంగ్ ఆ టైమ్‌లోనే కాకుండా ఇప్పటికీ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.
పాట ప్రదర్శనలో, రమ్యకృష్ణ వేసిన స్టెప్స్, ఎన్టీఆర్ వేసిన మాస్ మూమెంట్స్ కుర్రాళ్ల గుండెల్లో ఎప్పటికీ ముద్ర వేసాయి. ఈ పాట లేకుండా ఏవైనా ఫంక్షన్లు, ఈవెంట్లు, డీజే ప్రోగ్రామ్స్ జరగవు అని చెప్పుకోవచ్చు. ప్రతి వేడుకలో ఈ పాటకు వచ్చే రెస్పాన్స్ చూస్తే ఎన్టీఆర్ పాపులారిటీని ఊహించవచ్చు. ఇప్పటికీ ఈ పాటను అభిమానులు సోషల్ మీడియాలో పదేపదే షేర్ చేస్తూ, “చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు బ్రో!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. రమ్యకృష్ణ ఎనర్జీ, ఎన్టీఆర్ మాస్ వైబ్స్ కలిసిన ఈ పాట ఒక తరానికి మాత్రమే కాకుండా తరాల తరబడి గుర్తుండిపోయేలా చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..!