
ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. ఉసిరి జ్యూస్ జీవక్రియను వేగవంతం చేస్తుంది, దీనివల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఉసిరిలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఉసిరి జ్యూస్ ఎక్కువగా తాగితే కడుపులో మంట, విరేచనాలు వంటి సమస్యలు రావొచ్చు. రోజుకు ఒక గ్లాసు మాత్రమే తాగడం మంచిది. ఉసిరి జ్యూస్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి జ్యూస్ లో చక్కెర కలపకుండా తాగడమే మంచిది. కావాలంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
ఉసిరి జ్యూస్ తాజాది తాగడమే మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే దానిలోని పోషకాలు తగ్గిపోవచ్చు. ఉసిరి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే, ఏదైనా కొత్త ఆహారాన్ని మీ దినచర్యలో చేర్చాలనుకుంటే, ముందుగా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు