ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగింది. ఒక్కో హీరో తన సినిమాలు మాత్రమే కాకుండా, మరొక హీరోతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ టాప్ హీరోలు కూడా మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ప్రత్యేకంగా పేరు ప్రస్తావించాల్సిన వ్యక్తి కింగ్ నాగార్జున. ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో మాత్రమే కాదు, అందం, స్టైల్, వ్యక్తిత్వం అన్నీ కలగలిపిన మన్మధుడు కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి నాగార్జున చేసిన కృషి, ఆయన తీసుకున్న రిస్క్ ప్రాజెక్ట్స్, కొత్త కాన్సెప్ట్ సినిమాలు— ఇవే ప్రధాన కారణాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


అలాంటి నాగార్జునకు ఒకసారి పెద్ద షాక్ తగిలిందని, ఒక డైరెక్టర్ ఆయనను నమ్మించి చివరికి మోసం చేశాడని అప్పట్లో ఇండస్ట్రీలో చర్చలు నడిచాయి. ఆ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఈ సంఘటన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సమయంలో జరిగింది. అసలు ఈ సినిమాలో వెంకటేష్ చేసిన పాత్రను మొదట నాగార్జున కోసం మేకర్స్ ఆలోచించారట. మల్టీస్టారర్ కాంబినేషన్‌లో నాగార్జున – మహేష్ బాబు కాంబో స్క్రీన్‌పై కనిపించబోతుందని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు.


డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ‘కొత్త బంగారులోకం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల నుంచి ఆయనకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయట. అందులో మొదటి కాల్ నాగార్జునదే. ఆయన ఫోన్ చేసి, వ్యక్తిగతంగా కలవాలని పిలిపించి, సక్సెస్‌కి శుభాకాంక్షలు తెలిపారట. ఆ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల ఒక మల్టీస్టారర్ కథ కాన్సెప్ట్‌ను నాగార్జునకు వివరించారట. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మంచి ఎమోషనల్ స్టోరీ లైన్ ఉందని చెప్పగానే నాగార్జున వెంటనే ఆసక్తి చూపించి, “ఓకే, ప్లాన్ చేద్దాం, స్క్రిప్ట్ రెడీ చేయి” అని చెప్పారట.


అయితే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే సమయంలో కథ సురేష్ బాబు చెవిలో పడింది. సురేష్ బాబు ..వెంకటేష్ కోసం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ చూస్తున్నారని తెలిసి, శ్రీకాంత్ అడ్డాల ఆ కథలో కొన్ని మార్పులు చేసి, మరింత ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కలిపి వెంకటేష్‌కి చెప్పారట. ఆ కథ వెంకటేష్‌కి బాగా నచ్చడంతో వెంటనే దిల్ రాజు సపోర్ట్‌తో స్క్రిప్ట్ రెడీ చేయించుకుని సినిమా ప్రారంభించారు. అలా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నాగార్జున కాంబినేషన్‌లో రావాల్సింది ఉండగా, చివరికి మహేష్ బాబు – వెంకటేష్శ్రీకాంత్ అడ్డాల – దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కింది. ఈ సంఘటన తర్వాత కొంతమంది అభిమానులు, ఇండస్ట్రీలోని కొందరు, “శ్రీకాంత్ అడ్డాల నాగార్జునని నమ్మించి చివరికి ముంచేశాడు” అని కామెంట్లు కూడా చేశారు. ఈ ఘటనతో నాగార్జున అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు.


అయితే ఈ సంఘటన తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. ‘బ్రహ్మోత్సవం’, సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్‌తో నాగార్జునని ఆకట్టుకున్న శ్రీకాంత్, ఆ అవకాశాన్ని వదులుకోవడం ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు అయ్యిందని అంటారు. ఈ సంఘటన, సినిమాల్లో అవకాశాలు ఎలా ఒక్క క్షణంలో మారిపోతాయో చెప్పే ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: