ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దర్శకుడు అనిల్ రావిపూడి గురించి అభిమానులు విపరీతమైన చర్చలు జరుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు రకరకాల సజెషన్స్, ఐడియాస్ ఇస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు. ఆయన సినిమాలు భారీ పాన్-ఇండియా రేంజ్‌లో కాకపోయినా, సొంత స్టైల్లో చేసిన ఎంటర్టైన్మెంట్ చిత్రాలతోనే కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను కేవలం థియేటర్లకే కాకుండా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే స్థాయిలో ఆకట్టుకుంటాయి. అందుకే సినీ ప్రేక్షకులు, అభిమానులు “అనిల్ రావిపూడి సినిమా అంటే ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ” అని నమ్మకం పెంచుకున్నారు.


ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన "సంక్రాంతికి అవ్స్తున్నాం" తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన సినిమాలు సాధారణంగా థియేటర్లలో పండగ వాతావరణం సృష్టిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. “శంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడం మరింత ఆకర్షణగా మారింది.



ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే అనిల్ రావిపూడి, నాగార్జున కాంబినేషన్‌లో సినిమా తీయాలని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా కోరుతున్నారు. ఇప్పటికే ఆయన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లతో సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీంతో “మిగిలింది నాగార్జున గారు మాత్రమే. ఆయనతో కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే బాగుంటుంది” అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నాగార్జునకు ఉన్న క్లాస్, స్టైల్ మరియు అనిల్ రావిపూడి కధల్లో ఉండే ఫన్, ఎమోషనల్ టచ్ కలిస్తే ఆ సినిమా మాజిక్ సృష్టిస్తుందని సినీ ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఈ కాంబినేషన్‌పై విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. “అనిల్ రావిపూడి తన తదుపరి పెద్ద సినిమా నాగార్జునతో తీయాలని” అభిమానుల అభిలాష. ఇండస్ట్రీలో టాప్ సీనియర్ హీరోలందరితో ఇప్పటికే పనిచేసిన అనిల్, నాగార్జునతో చేస్తే ఆ జాబితా పూర్తవుతుంది. పైగా నాగార్జున చాలా కాలంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయకపోవడంతో, ఈ కలయిక అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఒక ఫుల్ మాస్ట్ ఎంటర్టైనింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇప్పుడు చూడాలి మరి, ఈ క్రియేటివ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, అభిమానుల డ్రీమ్ కాంబినేషన్‌ను నిజం చేస్తారో లేదో!

మరింత సమాచారం తెలుసుకోండి: