
హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం తేజ నుంచి వచ్చిన మరో సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా `మిరాయ్`. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటిక్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ మైండ్ బ్లోయింగ్‌గా, వీఎఫ్ఎక్స్ విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని సినీ ప్రియులు అభిప్రాడపతున్నారు. మిరాయ్ తో తేజ ఖాతాలో మరో బిగ్ హిట్ పడటం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్షన్స్ పరంగా హనుమాన్ రికార్డ్‌ను మిరాయ్ తో తేజ బ్రేక్ చేస్తాడా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
థియేట్రికల్ రన్ ముగిసేసరికి హనుమాన్ వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ గా రూ. 30 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను ఏకంగా రూ. 160 కోట్ల షేర్.. రూ. 60 కోట్ల గ్రాస్ వసూళ్లకు గాను ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు, తమిళంలో రూ. 4 కోట్లు, మలయాళంలో రూ. కోటి, కర్ణాటకలో రూ. 23 కోట్లు, హిందీలో రూ. 60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లు చొప్పున గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
మిరాయ్ విషయానికి వస్తే.. తేజ సక్సెస్ రేట్, సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. నైజాంలో రూ. 7.5 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా మిరాయ్ టోటల్ బిజినెస్ రూ. 28 కోట్లు. సో.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 30 కోట్ల షేర్.. రూ. 60 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
అయితే హనుమాన్ కలెక్షన్స్ ను మిరాయ్ క్రాస్ చేస్తుందా అన్నది ఆసక్తికంగా మారింది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఆ ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో మిరాయ్ దుమ్మురేపింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ 2 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1.70 కోట్లు) రాబట్టి హనుమాన్ రికార్డుల్ని దాటేసింది. ఇటు తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ అడ్వాన్స్ బుకింగ్‌లో మిరాయ్ దూసుకుపోతుంది.