
ఇటీవల థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సినిమాలలో యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా ఒకటి. మామూలు సినిమాల మధ్యలో ఒక యానిమేషన్ సినిమాగా వచ్చి ఈ సినిమా క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎలాంటి స్టార్ తారాగణం లేకపోయినప్పటికీ ఏకంగా థియేట్రికల్ ద్వారానే రు. 300 కోట్లు కొల్లగొట్టిన సినిమా “ మహావతార్ నరసింహ ”. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా చాలా కాలం తర్వాత థియేటర్లలో ఒక భారీ లాంగ్ రన్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో దుమ్ము లేపిందనే చెప్పాలి. ఈ భక్తిరస సినిమాకు ప్రేక్షకులు దాసోహయ్యారు.
ఓవరాల్‌గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 50 రోజుల రన్ పూర్తయ్యింది. ఎన్నో ఏళ్ళు నుంచి మిస్ అవుతున్న 50 రోజుల రన్ ని అది కూడా రికార్డు స్క్రీన్స్ లో పూర్తి చేసుకోవడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. మహావతార్ నరసింహ సినిమా ఏకంగా 200 థియేటర్లలో ఈ రన్ పూర్తి చేసుకుంది. థియేటర్లకు ప్రేక్షకులు రావడం గగనం అవుతోన్న వేళ ఇన్ని థియేటర్ల లో 50 రోజులు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమా స్ట్రాంగ్ రన్ తోనే థియేటర్ల లో దూసుకెళ్తుంది. ఈ డివోషనల్ సినిమాకు సామ్ సి ఎస్ సంగీతం అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు