తరచూ ఈ మధ్య ఎక్కువగా చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద చిత్రాలను ఢీ కొట్టి మరి భారీ కలెక్షన్స్ ను రాబడుతున్న చిత్రాలు చాలానే వస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన లోక చాప్టర్-1 సినిమా కూడా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ ని రాబడుతోంది. కేవలం రూ .30 కోట్లతో తెరకెక్కించిన ఈ ఫాంటసీ డ్రామా చిత్రం రెండు వారాలకి  రూ.200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళ సినీ ఇండస్ట్రీలోనే ఒక అరుదైన ఘనత అందుకుంది ఈ చిత్రం.


ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 సినిమా కేరళలో రూ .73 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డుని లోక చాప్టర్-1 సినిమా మార్కును దాటి వేసి రూ.74.7 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బాహుబలి రికార్డును కేరళలో అధికమించిన మొదటి సినిమాగా నిలిచింది ఈ చిత్రం. కేరళలోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రాలలో నాలుగవ స్థానంలో ఉన్నది. ఇందులో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్ నటించింది.ఇమె కెరియర్ లోనే ఒక బిగ్ బ్రేక్ అని చెప్పవచ్చు.


తెలుగులో కూడా హలో, చిత్రలహరి తదితర చిత్రాలలో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ లోక చాప్టర్ 1 చిత్రంలో మాత్రం అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఇమే అద్భుత శక్తులు ఉన్న యువతిగా పోషించిన" చంద్ర" పాత్ర కూడా అందరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ డామినిక్ అరుణ్ కుటుంబంతో కలిసి  చూసేలా సినిమాని తెరకెక్కించారు. ఇందులో దుల్కర్ సల్మా కీలకమైన పాత్రలో నటించారు. నస్లీన్ , శాండీ, అరుణ్ కురియన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ఇందులో ఏడు చాప్టర్ల వరకు ఉంటాయని దుల్కర్ సల్మా సక్సెస్ మీట్ లో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: