
బిగ్ బాస్ 9 లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మొదటివారం మొత్తం 9 మంది నామినేషన్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్న 9 మంది సెలబ్రిటీలలో నటుడు భరణి తప్ప మిగిలిన 8 మంది కూడా నామినేట్ అయ్యారు. సామాన్యుల నుంచి డిమాన్ పవన్ మాత్రమే నామినేట్ కావడం జరిగింది. సెలబ్రిటీలలో ఫస్ట్ వీక్ ఓటింగ్ విషయంలో లక్స్ పాప ఫ్లోరా షైనీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన శ్రేష్ఠ వర్మ చాలా తక్కువ ఓటింగ్ లో ఉండి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమెంట్ కాబోతున్నట్లు కనిపిస్తోంది.
ఫ్లోర షైనీ, శ్రేష్ట వర్మ, సంజన, సుమన్ శెట్టి, రాము రాథోడ్, రీతూ చౌదరి, తనూజ, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ నామినేషన్ కాగా ఇందులో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ సుమన్ శెట్టి ,తనుజాలకు అనూహ్యంగా భారీగానే ఓటింగ్ రావడంతో ఇక తక్కువ ఓటింగ్ వచ్చింది శ్రేష్ట శర్మ, ఫ్లోరా షైనీ మాత్రమే కాబట్టి. ఇందులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యా అవకాశం ఉన్నది. శ్రేష్ట శర్మ కి చాలా తక్కువ ఓటింగ్ వచ్చిందని చివరిలో ఉందని సమాచారం. ఈ విషయంపై క్లారిటీ రావాలి ఈరోజు తెలియబోతోంది. మరి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో చూడాలి.