సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన మూవీ లో మరొకరు నటించడం మనం చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అలా ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీ లో మరొక హీరో నటించిన సందర్భం లో ఆ హీరో రిజెక్ట్ చేసిన సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించినట్లయితే ఆ రోజు ఆ సినిమా మిస్ చేసి ఉండకూడదు అనే ఆలోచనకు నటులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీ లో మరొక హీరో నటించిన సందర్భం లో ఆ హీరో రిజెక్ట్ చేసిన మూవీ బాక్సా ఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని అందుకున్నట్లయితే ఆ రోజు ఆ సినిమాను రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాం అని కూడా నటులు భావించడం సర్వ సాధారణం.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించాడు. చిరంజీవి రిజక్ట్ చేసిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని అందుకుంది. దానితో జూనియర్ ఎన్టీఆర్ కి బాక్సా ఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ దక్కింది. ఆ సినిమా ఏది ..? అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ , డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రవాలా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో తారక్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. ఈ రెండు పాత్రలలో ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక పూరి జగన్నాథ్ ఈ మూవీ ని మొదట చిరంజీ వితో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించాడట. కానీ చిరంజీవి ఈ సినిమాలు రిజెక్ట్ చేశాడట. దానితో తారక్ తో ఈ మూవీ ని పూరి జగన్నాథ్ రూపొందించాడట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: