
తర్వాత వరుసగా పెద్ద అవకాశాలు దక్కించుకుని, ఒక దశలో బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగింది. ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అవ్వడంతో, లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు, ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఆమెతో పని చేయాలని క్యూలో నిలబడ్డారు. ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మెరిసినా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తి విరుద్ధంగా మారింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక లండన్ వ్యాపారవేత్తతో లవ్‌లో పడి, రిలేషన్‌షిప్ కొనసాగించింది. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఇది ఆమె జీవితంలో తీసుకున్న మొదటి తప్పు నిర్ణయం అని చాలామంది కామెంట్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్‌కి చెందిన నటుడు జావేద్ షేక్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు.
ఇక మళ్లీ రెండోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా… అది కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. మూడోసారి 2011లో దుబాయ్ వ్యాపారవేత్త మన్సూర్ షామీని పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ వివాహ జీవితం కూడా ఎక్కువ కాలం నిలువలేదు. ఇలా వరుస పెళ్లిళ్లు విఫలమవడంతో ఆమె వ్యక్తిగత జీవితం పూర్తి స్థాయిలో దెబ్బతింది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో, ముంబైలో సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కెరీర్‌లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందో, పర్సనల్ లైఫ్‌లో అంతే పెద్ద డిజాస్టర్ ఎదుర్కొంది. అందుకే చాలామంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ… "ప్రేమ అనేది ఆమె జీవితంలో ఒక్కసారే పుడుతుంది. నీకు ఇన్నిసార్లు పుట్టింది ఏంటి..?" అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి ట్రోల్స్‌ను, కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, తన సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా జీవనం కొనసాగిస్తోంది ఈ బ్యూటీ.