
ఈ చిత్రానికి "100 నాటౌట్" అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున తన కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేసి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ సినిమాలే తన కెరియర్ను నిలబెట్టేలా చేశాయి. అందుకే ఈసారి కూడా చాలా కాన్ఫిడెంట్ తోనే తన వందవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నది.
తన 100 వ సినిమా చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా గ్రాండ్గా ఓపెనింగ్ లాంచ్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇందుకు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించి ,చిరంజీవి చేతుల మీదుగా క్లాప్స్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు..అన్ని అనుకూలిస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ ఇద్దరు హీరోలు కూడా సినిమా లాంచ్ ఈవెంట్ కి వస్తే మాత్రం సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది. చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులు.. అలాగే ఎన్టీఆర్ ను కూడా తన పెద్ద కొడుకుల నాగార్జున భావిస్తూ ఉంటారు. అందుకే నాగార్జున పిలవగానే ఈ ఇద్దరు హీరోలు రావడానికి సిద్ధమయ్యారని వినిపిస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.