టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లుడు శ్రీను సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయాణం మొదలైంది. తొలి  సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ కు సక్సెస్ దక్కినా తర్వాత రోజుల్లో ప్రాజెక్ట్స్ ఎంపికలో జరిగిన పొరపాట్లు ఈ హీరోకు మైనస్ అయ్యాయి.  అయితే కొన్నేళ్ల క్రితం రాక్షసుడు మూవీతో హిట్ సాధించిన  బెల్లంకొండకు మళ్ళీ ఇంత  కాలానికి కిష్కిందపురి సినిమాతో సక్సెస్ దక్కింది. కిష్కిందపురి మూవీ బ్రేక్ ఈవెన్ అయింది.

విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడటం,  హర్రర్ కామెడీ మూవీ కావడం, ట్రైలర్ చివరి షాట్ లో అనుపమ ఒకింత పవర్ ఫుల్ గా కనిపించడం ట్రైలర్ కు ప్లస్ అయింది.  అయితే మిరాయ్  సినిమాతో పోటీ పడటం ఈ సినిమాకు మైనస్ అయింది. విడుదలకు ముందే 10, 11 తేదీలలో ప్రీమియర్స్  ప్రదర్శించడం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

ఈ సినిమాకు నిర్మాత సాహో  గారపాటి కావడంతో అటు చిరంజీవి ఇటు అనిల్ రావిపూడిసినిమా ప్రమోషన్స్ కు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అయితే కిష్కిందపురి మూవీకి ఏకంగా 32 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు కాగా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా మూడు వంతుల బడ్జెట్ రికవరీ అయింది. మిగతా మొత్తాన్ని మాత్రం  బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ అయింది.

సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమా ఒకింత భారీగానే కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.  కిష్కిందపురి మూవీ సక్సెస్ తో బెల్లంకొండ శ్రీనివాస్  టైసన్ నాయుడు సినిమాపై  అంచనాలు పెరుగుతున్నాయి. 14 రీల్స్ బ్యానర్ పై  ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ లో  కదలిక వచ్చింది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలవుతుందని బెల్లంకొండ శ్రీనివాస్ చెబుతున్నా అదే బ్యానర్ లో తెరకెక్కుతున్న అఖండ2 సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ కానుండటంతో  ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టేనని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: