బిగ్ బాస్ సీజన్ 9 మొదలై మొదటివారం లేడీ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన శ్రేష్ట వర్మ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు రెండవ వారం నామినేషన్ కూడా కాస్త గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈవారం హౌస్లో మనీష్, హరిత హరీష్, డిమాన్ పవన్, ప్రియా శెట్టి, భరణి, ఫ్లోరా సైని  కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటికి వస్తారనే విషయం పై ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ సమయంలో అటు హౌస్ మేట్స్ మధ్య ఒక రేంజ్ లో గొడవలు,గట్టి వాదనే  జరుగుతున్నాయి.

తనూజ, రీతూ చౌదరి, శ్రీజ, హరీష్ పై కూడా గట్టిగానే గొడవ పడుతున్నారు. డిమాన్ పవన్ రెండవ వారం క్యాప్టెన్సీగా అయ్యారు. కాబట్టి అతని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రేక్షకుల సపోర్టు మాత్రం ఎక్కువగా సుమన్ శెట్టికే కనిపిస్తోంది. ఓటింగ్ లో కూడా సుమన్ శెట్టి ముందంజలోనే కనిపిస్తున్నారు.  ఆ తర్వాత మరో కంటెస్టెంట్ భరణి కూడా జెన్యూన్ గానే హౌస్ లో కనిపిస్తున్నారు. ప్రేక్షకుల మద్దతు కూడా గట్టిగానే ఉన్నది.


ఇక హరిత , ఫ్లోరా షైని పరవాలేదు అనిపించుకున్నారు. ఇక ఓట్ల పరంగా బాగానే పడుతున్నాయి. మిగిలినది మనీష్, ప్రియా శెట్టి వీరిద్దరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రీయాశెట్టి కి కూడా చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయని. నేటితో ఈ ఓటింగ్ ముగియనుంది. కాబట్టి ఈ ఇద్దరి లో ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటికి వెళ్లి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మనీష్ కంటే ప్రియా కు కొన్ని ఓట్లు ఎక్కువగా పడుతున్నట్లు సమాచారం. మరి మనీష్ వెళ్తారా ప్రియా శెట్టి వెళ్తారా అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: