- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చెప్పుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ అభిమానులలో అత్యంత స్పెష‌ల్‌గా పేరు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్‌ను తనకు దేవుడిగా భావించే స్థాయిలో ఆయన చూపించే ఆరాధన ఇతర అభిమానులకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. అందుకే ఆయనను చూసి చాలా మంది పవన్ అభిమానులు తమని తాము చూసుకున్నట్లే ఫీల్ అవుతుంటారు. ఇటీవలి కాలంలో పవన్ సినిమాల ఈవెంట్స్‌లో బండ్ల గణేష్ కనిపించకపోవడం అభిమానులను కొంత నిరాశపరిచింది. ముఖ్యంగా పవన్ లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి OG ఈవెంట్‌కి బండ్ల‌ తప్పకుండా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, ఆయన రావడం లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఓజి సినిమా గురించి బండ్ల‌ చేసిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


“నేను కూడా కోట్లాది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకడినే. ఓజి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా” అని బండ్ల గణేష్ చెప్పిన మాటలు పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ స్టేట్మెంట్‌తో ఆయన మళ్లీ పవన్ ఫ్యాన్స్ దృష్టిలోకి రావ‌డంతో పాటు ఈ స్టేట్‌మెంట్ ప‌వ‌న్ అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చింద‌నే చెప్పాలి. అదే సమయంలో, ఓజి ఈవెంట్‌కి నిజంగా బండ్ల గణేష్ వస్తే, తన స్పీచ్‌తో ఫ్యాన్స్‌లో మరో లెవెల్ ఎగ్జైట్మెంట్ తీసుకురావడం ఖాయం. పవన్ పై ఆయన చూపించే అభిమానాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్, ఇప్పటికే ఆయన కోసం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మొత్తానికి, బండ్ల గణేష్ హాజరవుతారా లేదా అన్నది పక్కన పెడితే, ఓజి బ్లాక్‌బస్టర్ అవుతుందనే ఆయన నమ్మకం పవన్ అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: