టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ సినిమాలోని తన పాత్ర డిమాండ్ చేస్తే ఏ స్థాయిలో అయినా కష్ట పడడానికి రెడీగా ఉంటాడు. కెరియర్ ప్రారంభంలో తారక్ చాలా లావుగా ఉండేవాడు. లావుగా ఉన్నా కూడా అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేస్తూ , సూపర్ సాలిడ్ పెర్ఫార్మన్స్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక లావుగా ఉన్న తారక్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ సినిమా కోసం ఒక్క సారిగా భారీ స్థాయిలో లావు తగ్గి సన్న బడ్డాడు.

అలా సన్న బడ్డ లుక్ తో ప్రేక్షకులను తారక్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యామదొంగ సినిమా దగ్గర నుండి తారక్ ఎప్పుడు కూడా సన్న బడ్డ లుక్ లోనే కనిపిస్తూ వస్తున్నాడు. ఏదో ఒకటి రెండు సినిమాలో కాస్త లావుగా కనిపించిన ఎక్కువ శాతం సన్న గానే కనిపిస్తూ వస్తున్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ భారీ స్థాయిలో బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్ట పడి 7 వారాల్లో 9.5 కిలోస్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక తారక్ బరువు తగ్గింది ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన లుక్ లో కనబడడం కోసం అని తెలుస్తుంది. మరి ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏకంగా 7 వారలు కష్టపడి 9.5 కిలోల బరువు తగ్గిన తారక్ ఈ సినిమాలో అదిరిపోయే లుక్ లో కనిపిస్తాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. తారక్ , ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: