
"తన తండ్రి చనిపోయి వారం రోజులు అయింది కానీ నాకు ఒక యుగంలా గడిచింది.. సినీ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదనే రోజులలో ఎంతో మందిని ఎదిరించి తనకు అండగా నిలిచిన తండ్రి.. అమ్మకు సమయం కుదరకపోవడం వల్ల తనతో పాటు షూటింగ్లకు వచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అమ్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక చిన్న క్లినిక్ పెట్టి మూగజీవాలకు ఆపద్బాంధవుడుగా మారారు అలాంటి వారికి తాను కూతురుగా ఉండడం చాలా గర్వకారణం అంటూ తెలియజేస్తే మిస్ యు డాడీ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సదా".
ఈ విషయం విన్న అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు ,అభిమానుల సైతం సదాకు ధైర్యంగా ఉండమంటూ సలహా ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సదా తండ్రి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సదా తండ్రి సయ్యద్ డాక్టర్ గా మహారాష్ట్ర ప్రాంతంలో సేవలు అందించారు.. సదా 2002లో వచ్చిన జయం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత ప్రాణం, అపరిచితుడు, వీరభద్ర, దొంగ దొంగది తదితర చిత్రాలలో నటించింది. అంతేకాకుండా పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించిన సదా.. ప్రస్తుతం స్నేక్ క్యాచర్ గా తన జీవితాన్ని గడిపేస్తోంది. ప్రస్తుతం సదా షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.