ప్రస్తుతం బాలీవుడ్–టాలీవుడ్ మీడియా వర్గాల్లో సంచలనంగా మారిన న్యూస్ ఏమిటంటే, హీరోయిన్ దీపికా పదుకొనేను “కల్కి 2” మూవీ నుంచి తప్పించేశారన్న విషయం. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. గత నలభై ఎనిమిది గంటలుగా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండింగ్ అవుతూ, విపరీతంగా వైరల్ అవుతోంది.ఇదంతా జరుగడానికి కారణం ఎవరంటే, తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ కాంట్రవర్సీ వెనుక హీరోయిన్ రష్మిక మందన్న అని చెబుతున్నారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ మీడియా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే “మోస్ట్ వాంటెడ్ హీరోయిన్” గా పేరు తెచ్చుకున్న రష్మిక, దీపిక కెరీర్‌లో వచ్చిన ఈ పరిస్థితికి పరోక్ష కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.


అసలు విషయానికి వస్తే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మిక మందన్నానే ఫిక్స్ చేశారట. “అనిమల్” సినిమా సమయంలో రష్మికతో పనిచేసిన అనుభవం వంగా కి ఉండటంతో పాటు, ఆమె డెడికేషన్, ప్రొఫెషనలిజం చూసి ఫిదా అయిపోయారని టాక్. అందుకే మొదటి ఆప్షన్ రష్మికేనట. అయితే, రష్మిక ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందని సమాచారం. కారణం ఏంటంటే, అప్పటికే ఆమె “అనిమల్ పార్క్” సినిమాలో హీరోయిన్‌గా అగ్రిమెంట్‌పై సైన్ చేసింది. అలాగే, వరుసగా ఒకే డైరెక్టర్‌తో బ్యాక్–టు–బ్యాక్ సినిమాలు చేయడం తన కెరీర్‌కి నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుందని భావించి “స్పిరిట్” నుంచి తప్పుకుందట.



రష్మిక ఈ ప్రాజెక్ట్‌కి అంగీకరించి ఉంటే అసలు దీపిక పదుకొనేకి ఈ సినిమాలోకి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. అలాంటప్పుడు ఈ కాంట్రవర్సీ, ఈ టార్గెటింగ్ అన్నీ జరగవు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యి దీపికకు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.దీంతో నెటిజన్లు “దీపిక ఈ సమస్యల్లో ఇరుక్కోవడానికి అసలు కారణం రష్మికనే” అంటూ మండిపడుతున్నారు. కొంతమంది అయితే రష్మికను “సైలెంట్ కిల్లర్” అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.



ఇక మరోవైపు, దీపిక పదుకొనేకి ఉన్న గ్లోబల్ ఇమేజ్‌కి గట్టి దెబ్బ తగిలిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక హీరోయిన్ ఇంత డిమాండ్స్ పెట్టడం, మేకర్స్‌ను ఇంత టార్చర్ పెట్టడం సరైన పద్ధతి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అభిమానులు మాత్రం దీపికపై వస్తున్న నెగిటివ్ వేవ్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. “దీపిక త్వరగా రియాక్ట్ అయి నిజం ఏంటో చెప్పాలి, లేదంటే ఈ వివాదం మరింత పెరిగిపోతుంది” అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దీపిక పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోవడం మరో మిస్టరీగా మారింది.ఇక “దీపిక పదుకొనే ఎప్పుడు స్పందిస్తారు..? ఈ వివాదంపై ఆమె నిజమైన వెర్షన్ ఎప్పుడు వస్తుంది..?” అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: