
అయితే తమన్నా గత కొంతకాలంగా అధిక బరువు ఉండడంతో చాలామంది ఇమెను ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల పైన ఏమాత్రం స్పందించకుండా సైలెంట్ గా ఉన్న తమన్నా తనపై వస్తున్న ట్రోల్స్ మనసులో పెట్టుకొని మరి క్రమం తప్పకుండా వర్క్ అవుట్ చేస్తూ తను తాను స్లిమ్ముగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తమన్నా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మరింత సన్నగా అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నానని.. చాలా స్లిమ్ముగా, నాజూగ్గా తయారయ్యి రాబోయే రోజుల్లో అభిమానులకు సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నానని తెలిపింది.
మొత్తానికి తమన్నా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు ఆనందాన్ని తెలుపుతున్నారు. మళ్లీ పాత రోజులను తమన్నా గుర్తుకు చేసుకునేలా సిల్వర్ స్క్రీన్ పైన మ్యాజిక్ చేస్తుందని తెలుపుతున్నారు. తమన్నా సినిమాల విషయానికి వస్తే చివరిగా ఓదెల-2 చిత్రంలో నటించింది. ప్రస్తుతం రెమో, రేంజర్ తదితర బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దు గుమ్మ. ఒకవైపు స్పెషల్ సాంగ్లలో కూడా కనిపిస్తూ బాగానే అట్రాక్షన్ చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్స్ వల్లే పలు చిత్రాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనుకునే సమయానికి విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.