
అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రశ్న మాత్రం వైరల్ అవుతోంది – "ఎందుకు ప్రభాస్ స్పందించడం లేదు?" గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పించబడినప్పుడు కూడా ప్రభాస్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అప్పట్లో "బహుశా ఆయనకి ఈ విషయం మీద మాట్లాడడం ఇష్టం లేకపోయి ఉంటుందేమో" అని అభిమానులు లైట్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కల్కి 2 విషయంలో అదే సన్నివేశం రిపీట్ కావడంతో నెటిజన్లు పెద్ద చర్చ మొదలుపెట్టారు.
ఇక మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – గతంలో దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కల్కి ప్రమోషన్ ఈవెంట్లలో ప్రభాస్ ఆమెతో ఎంత చనువుగా, ఎంతో సపోర్టివ్‌గా ఉండాడో అందరికీ తెలిసిందే. అలాంటి ఒక స్నేహితురాలిని సినిమా నుంచి తీసేస్తే ప్రభాస్ సైలెంట్‌గా ఉండిపోవడం ఏంటి? అని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా దీని మీద పూర్తిగా సైలెంట్‌గా లేడని తెలుస్తోంది. ఆయన మూవీ టీమ్‌ని సంప్రదించి, "దీపికా ఎందుకు ఈ సినిమా నుంచి తప్పించారు?" అని క్లారిటీ అడిగినట్లు సమాచారం. దీనికి మేకర్స్ కూడా వివరణ ఇస్తూ – "ఒకవైపు కాల్‌షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం, మరోవైపు దీపికా రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటం వలననే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని క్లియర్‌గా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఇన్సైడ్ సమాచారం కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో మళ్లీ ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు, ప్రభాస్ - దీపికా పదుకొనేకు ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా బజ్ వినిపిస్తోంది. "సినిమా సినిమా, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే" అంటూ ఫన్నీగా, లైట్ మోడ్‌లో మాట్లాడుతూ ఆమె మనసు బాగు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో యూనివర్సిటీ లాగా వైరల్ అవుతోంది. అభిమానులు అయితే "ప్రభాస్ లాంటి జెంటిల్‌మన్‌ఫ్రెండ్ ఉన్నంతవరకు దీపికాకి ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాలకైతే – కల్కి 2 నుంచి దీపికా తప్పించబడటం, దానికి సంబంధించిన ప్రభాస్ రియాక్షన్ చుట్టూ తిరుగుతున్న చర్చలే ప్రధాన టాపిక్‌గా మారిపోయాయి.