ఈ మధ్యకాలంలో మహిళల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎక్కడ చూసినా చర్చలు మొదలవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా, న్యూస్ ఛానెల్స్ వేదికగా, పబ్లిక్ ప్లాట్‌ఫాంల్లో కూడా ఆడవాళ్లు వేసుకునే బట్టల మీదే ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది పెద్దలు, వయసు మర్చిపోయి, మహిళల వస్త్రధారణ గురించి తక్కువ చేసి మాట్లాడటం, ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒక రొటీన్‌లా మారిపోయింది.ఇటీవలే మంచు లక్ష్మి వేసుకున్న డ్రెస్సింగ్‌పై ఒక జర్నలిస్టు చేసిన కామెంట్లు ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ ప్రశ్న ఎంత హార్ట్‌గా వేసారో, దానిపై ఎంత చర్చ జరిగిందో ఇండస్ట్రీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.


ఇలాంటి టైంలోనే పలువురు హీరోయిన్‌లు కూడా తమ అభిప్రాయాలు బయటపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ వేదిక సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌లో ఘాటు రియాక్షన్ ఇచ్చింది. మహారాష్ట్ర బ్యూటీగా పేరొందిన ఈమె ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా నిలవడానికి ప్రయత్నిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇలా ఐదు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ పెద్ద హిట్ మాత్రం ఇంకా సరిగా రాలేదు. అయినప్పటికీ ఆమె ఎప్పటికప్పుడు వివిధ ఇష్యూలపై తన స్పష్టమైన అభిప్రాయాలు బయటపెడుతూ ఉంటుంది.ఇక వస్త్రధారణపై వేదిక చేసిన కామెంట్లు మాత్రం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. “ఎవరు బికినీ వేసుకున్నా, ఎవరు చీర కట్టుకున్నా అది వాళ్ల వ్యక్తిగత ఇష్టం. దాన్ని ఎవరు తప్పుపట్టే హక్కు లేదు. మహిళల దుస్తుల గురించి విమర్శించే ఈ దుస్థితి ఇక మారాలి.” అంటూ స్పష్టం చేసింది.



అంతేకాదు, “హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించే దుస్తులు వేసుకుంటే వెంటనే వాళ్ల క్యారెక్టర్‌పై దాడి చేయడం, విమర్శించడం సరైనది కాదు. ఆడవాళ్లు ఏమి ధరించాలో, ఎలా ఉండాలో చెప్పే సమాజం ముందుగా తన ఆలోచనలు మార్చుకోవాలి" అంటూ వేదిక సజెస్ట్ చేసింది. దీని పై అమ్మాయిలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుంటేనే మగాళ్లకు మూడ్ వస్తుందా? మరి చిన్నపిల్లల విషయంలో ఎందుకు దారుణంగా వ్యవహరిస్తున్నారు? వాళ్లపై జరిగే అఘాయిత్యాలకు వస్త్రధారణ ఏ సంబంధం?” అంటూ అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ, వేదికకు సపోర్ట్ చేస్తున్నారు. “అవును, నిజమే… సమాజం అమ్మాయిల దుస్తుల మీద కాకుండా, మగాళ్ల తీరుపై ప్రశ్నించాలి” అంటూ నెటిజన్లు కూడా రిప్లై ఇస్తున్నారు.



మొత్తం మీద, వేదిక చెప్పిన మాటలు మళ్లీ ఒక పెద్ద డిబేట్‌కు దారి తీసాయి. మహిళల దుస్తులు చూసి వాళ్ల క్యారెక్టర్‌ని తూకం వేయడం, దుస్తులకే తప్పు వేసి హింసకు న్యాయం చేయడం అన్నివేళలా తప్పు అన్న విషయాన్ని మళ్లీ బలంగా గుర్తు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: