జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రీతూ చౌదరి ఆ తర్వాత పలు ప్రమోషన్స్,ఈవెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కి బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది.అలా బిగ్ బాస్ లోకి వెళ్లిన రీతూ చౌదరి తన గ్లామర్ తో అదరగొట్టేస్తోంది.ముఖ్యంగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టు ఇద్దరితో హౌస్ లో ప్రేమాయణం నడిపిస్తూ హౌస్ లో హైలెట్ గా ఉండటమే తన లక్ష్యం అనేలా నిలుస్తుంది.అయితే హౌస్ లో లవ్ ట్రాక్ లు నడిపిస్తే చాలా మంది జనాల దృష్టిలో పడతారు.వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తే ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో రీతూ ఇలాంటి పని చేస్తుందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ లోకి వెళ్లిన రీతూ చౌదరి వల్లే తన బతుకు నాశనం అయిందని, నా భర్తతో ఆమె ఎఫైర్ పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ నటుడి భార్య.

మరి ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే ధర్మ మహేష్ భార్య గౌతమి.. గత కొద్దిరోజులుగా ధర్మ మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన గురించి ఎన్నో నిజాలు బయటపెడుతున్న గౌతమి రీసెంట్ గా ఓ అమ్మాయి తో ఎఫైర్ వల్లే నాతో గొడవలు వచ్చాయి. ఆ సెలబ్రిటీ తో నా భర్త ఒకే ప్లాట్ లో సహజీవనం కూడా చేశాడు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అమ్మాయి పేరుతో సహా బయట పెట్టింది.ఆమె ఎవరో కాదు రీతూ చౌదరి. తాజాగా రీతూ చౌదరి కి సంబంధించి ధర్మ మహేష్ కి పెట్టిన కొన్ని వాట్సప్ మెసేజ్లు లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది గౌతమి. బిగ్ బాస్ రీతూతో తన భర్త ఎఫైర్ పెట్టుకోవడం వల్లే తనకి తన భర్తకి గొడవలు వచ్చాయి అంటూ గౌతమి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఓకే ఫ్లాట్లోకి రీతు ధర్మ మహేష్ ఇద్దరు వెళ్తున్న వీడియోని కూడా షేర్ చేసింది.
దీంతో ఈ వీడియో పై మరో చర్చ కూడా సాగుతుంది. వీరిద్దరూ ఓకే ఫ్లాట్లో ఉంటూ సహజీవనం చేశారా.. లేక డ్రగ్స్ తీసుకున్నారా అనే రూమర్ వైరల్ అవుతుంది. ఇక గౌతమీ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో రీతూ చౌదరితో ఎఫైర్ పెట్టుకున్నారని, అదేంటి అని అడిగితే తనని హింసించి కొట్టి దూరం పెట్టారని, అలాగే తనని తన కడుపులో ఉన్న బిడ్డని చంపాలని కూడా మహేష్ చాలా సార్లు ప్రయత్నించారని రీతు చౌదరి చెప్పడం వల్లే తనని ఇలా దూరం పెట్టారని గౌతమి చెప్పుకొచ్చింది. అయితే రీతూ గురించి పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది గౌతమి. అందులో ఓ యువతి వల్ల నా జీవితం,నా కొడుకు జీవితం నాశనం అయ్యింది.నా సంతోషంతోపాటు నా కుమారుని సంతోషాన్ని కూడా ఆ యువతి లాగేసుకుంది అంటూ ఒక నోట్ పోస్ట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి గౌతమి బయటపెట్టిన ఈ సాక్ష్యాధారాలు బిగ్ బాస్ లోకి వెళ్లిన రీతూ చౌదరికి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: