
మెగాస్టార్ చిరంజీవి హీరో మొట్టమొదటిసారిగా సంతకం చేసిన చిత్రం "ప్రాణం ఖరీదు". ఈ సినిమా సెప్టెంబర్ 22- 1978 లో విడుదలై హీరోగా మారారు. ఈ సినిమా విడుదల ఇప్పటికీ 47 సంవత్సరాలు అవుతోంది. ప్రపంచం గర్వించదగ్గ అసాధారణమైన నటుడుగా పేరుపొందిన చిరంజీవి..అలా హీరోగా ఇప్పటికీ రానిస్తూనే ఉన్నారు."మన ఊరి పాండవులు" సినిమాలో (కృష్ణం రాజు, చిరంజీవి, మురళి మోహన్) నటించారు.. చిరంజీవి తన నటనతో ఆకట్టుకోవడంతో కెరియర్ కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి పేరు సంపాదించారు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు , మురళీమోహన్, చంద్రమోహన్ , మోహన్ బాబు మరి కొంతమంది హీరోల చిత్రాలలో కూడా నటించారు. కొన్ని చిత్రాలలో విలన్ పాత్రలలో కూడా నటించారు చిరంజీవి.
ప్రాణం ఖరీదు సినిమాలో జయసుధ, చంద్రమోహన్, రావు గోపాల్ రావు తదితరులు నటించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోటా శ్రీనివాసరావుకు ఇది మొదటి సినిమానే. ప్రాణం ఖరీదు సినిమా భారత దేశంలో స్వతంత్రం రాకముందు ఉండేటువంటి కాలం నాటి కథ అంశంతో తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన నటన నటించారు. మొదట ఈ చిత్రాన్ని డైరెక్టర్ కె.వాసు దర్శకత్వం చేయడానికి ఇష్టపడలేదట. కానీ నిర్మాత క్రాంతి కుమార్ చిరంజీవి గురించి చెప్పి మరి తీయించారు. అలా హీరోగా మారిన చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడుగా పేరు సంపాదించారు.