తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. ఈయన నిర్మాతగా కేరిర్ను స్టార్ట్ చేసిన తర్వాత వరస పెట్టి అనేక విజయాలను అందుకున్నాడు. దానితో అత్యంత తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఈయనకు మంచు గుర్తింపు వచ్చింది. కెరియర్ స్టార్టింగ్ లో ఈయన ఏ స్థాయి విజయాలను అందుకున్నాడో ఆ స్థాయి విజయాలను ఈ మధ్య కాలంలో మాత్రం డీల్ రాజు అస్సలు అందుకోవడం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలలో అనేక సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

కొంతకాలం క్రితం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇక దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో డీల్ రాజు కి భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇక కొంతకాలం క్రితం దిల్ రాజు , నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

దిల్ రాజు తన తదుపరి మూవీ ని విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. దిల్ రాజు , విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే టైటిల్తో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తీసుకోబోతున్నట్లు , అలాగే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఒక వేళ ఈ సినిమా గనుక అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ ద్వారా కూడా దిల్ రాజు కు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: