సీనియర్ నటి రాశి రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది.తాను అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం..అలాగే తన సినీ కెరియర్ నాశనం చేసిన డైరెక్టర్ పేరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఒకే ఒక్క సినిమా షూటింగ్ సెట్లో చూసి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ మునిని తాను ప్రేమించినట్టు మొదట తానే పెళ్లి చేసుకుందామని అడిగినట్టు కూడా రాశి ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతేకాకుండా తాను చేసిన ఓ సినిమా కారణంగా తన సినీ కెరీర్ నాశనం అయిందని,ఆ సినిమా ఏంటో, ఆ డైరెక్టర్ ఏంటో ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాను అని కూడా చెప్పింది.అలా పరోక్షంగా డైరెక్టర్ తేజ కి చురకలు అంటించింది.

ఇదంతా పక్కన పెడితే ఈ ఇంటర్వ్యూలో తన కూతురు సినీ ఎంట్రీ గురించి కూడా బయట పెట్టింది. యాంకర్ మీ కూతురు నెక్స్ట్ సినిమాల్లోకి వస్తుందా అని అడగగా.. ఏమో మనం డిసైడ్ చేయలేము. ఆమెకి ఇష్టం ఉంటే వస్తుంది కానీ నా కూతురు చాలా స్మార్ట్.. స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఫ్యూచర్లో ఏమవుతావు అని అడిగితే..నేను మా మమ్మీ లాగా హీరోయిన్ అవుతా అని చెబుతుందట. అంటూ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది రాశి.అంటే నెక్స్ట్ జనరేషన్ లో మీ అమ్మాయి హీరోయిన్ కాబోతోంది అన్న మాట అని యాంకర్ అడగగా.. ఏమో చెప్పలేం అని రాశి సమాధానం ఇచ్చింది.

అలాగే ఒకవేళ మీ కూతురిని సినిమాలోకి హీరోయిన్గా పరిచయం చేయాలి అనుకుంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఏ హీరోతో మీ కూతురు సినీ ఎంట్రీ ఉంటుంది అని యాంకర్ అడగగా.. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీకి వస్తున్నారు . నా కూతురు గురించి చెప్పాలంటే నేను శ్రీకాంత్ కొడుకు రోషన్ తో నా కూతురు సినీ ఎంట్రీ ఉండాలని అనుకుంటాను అని రాశి చెప్పింది. ఇక  రాశి ఆ మాట చెప్పడంతోనే అమ్మ ఏమో ఫాదర్ తోని,కూతురేమో కొడుకు తోని అంటూ నవ్వుకున్నారు.ఎందుకంటే రాశి శ్రీకాంత్ తో ఎన్నో సినిమాలు చేసింది. ఇక రాశి తన కూతురిని శ్రీకాంత్ కొడుకు రోషన్ తో ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అని చెప్పడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి: