పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్‌లో రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క వైపు ఆయన సినిమాను ఆకాశానికి ఎత్తేసి పొగిడే అభిమానులు ఎంతమంది ఉంటారో, మరో వైపు ఆయన సినిమాపై ట్రోలింగ్ చేస్తూ తిట్టే, ఎగతాళి చేసే వారూ అంతే మంది సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ఆయనను ఏమాత్రం కదిలించవు. ఆయన తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగే మనిషి. ప్రస్తుతం కూడా అదే పని చేస్తున్నారు.


ఇలాంటి సందర్భంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా “ఓజీ – ఓజాస్ గంభీర్”. ఈ చిత్రం నిన్న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినది పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన మేనరిజం. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ అన్నీ ఈ సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్వంగా – “ఇది మా పవన్ సినిమా” అని చెప్పుకునే స్థాయిలో దర్శకుడు సుజిత్‌ భుజం మీద ఎక్కించారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ ఖుషీతో పండగ వాతావరణం సృష్టించారు. ఎక్కడ చూసినా సందడి, ఫుల్ ఎనర్జీ వాతావరణం నెలకొంది. కేవలం ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్, అమెరికా,  వంటి దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హంగామా చేశారు. సోషల్ మీడియాలో, థియేటర్స్ చుట్టూ ఒకే ఒక నినాదం వినిపించింది – “ఓజీ బ్లాక్ బస్టర్”.



అయితే ఈ హంగామా మధ్యలో కొంతమంది నెగిటివ్ బ్యాచ్ మాత్రం వేరే ఆనందం పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా కూడా, కేవలం పైశాచిక సంతోషం కోసం, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తూ “డిజాస్టర్ ఓజీ” అంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా పడని కొంతమంది గ్రూపులు ఈ నెగిటివ్ ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నారు. అయితే వీరికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. “సినిమా నిజంగా ఎంత బాగుందో, ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించిందో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మీరు మొదట థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి, ఆ తర్వాత మాట్లాడండి” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్స్ ఇస్తున్నారు. నిజంగా ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఒక మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. తమన్ సంగీతం సినిమాకి ప్రత్యేకమైన హైలైట్ అయింది. థియేటర్‌లో సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటల మాస్ రెస్పాన్స్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియెన్స్ మాటల్లో చెప్పలేం.



మొత్తం మీద, “ఓజీ” సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయి. అభిమానులు పండగ చేసుకుంటూ ఉన్న ఈ సమయంలో, కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ పైశాచిక ఆనందం పొందుతున్నా, సినిమా విజయం మాత్రం అందరికీ స్పష్టంగా కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: