
ఇటీవల ఆయనకు జరిగిన చిన్న ప్రమాదం ఫ్యాన్స్‌ని ఒక్కసారిగా కలవరపెట్టింది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో టీమ్ నిర్లక్ష్యం వల్ల చిన్న యాక్సిడెంట్ జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా, పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, వైద్యులు ఆయన్ని కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న భారీ చిత్రం మూడు నెలల పాటు వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. “ఇప్పుడప్పుడేఅమళ్లీ ఎన్టీఆర్‌ను తెరపై చూడగలమా?” అనే ఆందోళనలో ఫ్యాన్స్ ఉండిపోయారు.
అయితే, అభిమానులను మరలా కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో జరగనున్న “కాంతారావు: చాప్టర్ 1” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. రిషబ్ శెట్టి–జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. ఆ బంధం కారణంగానే ఎన్టీఆర్ ఈ వేడుకలో పాల్గొనడం ఖాయం అయ్యింది. ఇక అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.
ఇక ఎన్టీఆర్ ఈ వేదికపై కనిపించడం అభిమానులకు నిజంగా పండగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఎందుకంటే, చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్న ప్రశ్న ఒకటుంది – ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణలపై ఏదైనా స్పందిస్తారా? అని అనుకుంటున్నారు. సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఏమిటంటే, బాలయ్య–ఎన్టీఆర్ మధ్య గతంలో నుంచి ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. అదే సమయంలో చిరంజీవితో ఎన్టీఆర్ మంచి రాపో కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయం వెల్లడిస్తే, అది నిజంగానే పరిశ్రమలో కొత్త అధ్యయనానికి నాంది అవుతుందని అంటున్నారు.
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాటల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆయన చెప్పే ఒక్కో మాట ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, పరిశ్రమ మొత్తానికి పెద్ద సందేశంగా మారుతుంది. కాబట్టి ఈ వేడుకలో ఆయన చేసే ప్రసంగం, ముఖ్యంగా ఆయన మాట్లాడే విషయాలు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి కూడా కీలకంగా మారవచ్చు.
మరి, రాబోయే గంటల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారు? అభిమానులను ఎలా అలరిస్తారు? పరిశ్రమలో కొత్త దిశలో చర్చ మొదలవుతుందా? అన్న ప్రశ్నలతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.