మన తాతలు తండ్రుల కాలంలో  సినిమా చూడాలి అంటే పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ కూడా ఒకటో రెండో థియేటర్స్ ఉంటే  గంటల తరబడి వెయిట్ చేసి అయినా సినిమా చూసి వచ్చేవారు. ఇప్పుడు మారుమూల చిన్న చిన్న ప్రాంతాలకు కూడా థియేటర్లు వచ్చాయి. అంతేకాదు పట్టణాల్లో పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లు వస్తున్నాయి. ఇక హైదరాబాదులో ఒకదానికి మించి మరో మల్టీప్లెక్స్ తయారవుతోంది. ముఖ్యంగా ప్రజలకు అత్యాధునిక ఆనందాన్నిస్తూ ఆహ్లాదాన్ని పంచే ఈ మల్టీప్లెక్స్ లో సినిమా చూసి ఆనందించే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మనకు సరికొత్త వినోధాన్ని పంచేందుకు మరో రెండు మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. ఈమధ్య నార్సింగి ప్రాంతంలో మిరాజ్ సినిమాస్ ఆనంద్ మాల్ అండ్  మూవీస్ ను ప్రారంభించారు.

 ఈ మల్టీప్లెక్స్ లో నాలుగు అత్యాధునిక  డాల్బీ డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి.. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు సినీ నిర్మాత దిల్ రాజు..నటుడు దర్శకుడు నారాయణమూర్తి, రఘురాం గ్రూప్ ఎండి ఆనంద్ రావు మీరాజ్ సినిమాస్ ఎండీ భువనేశ్వర్ హాజరై ప్రారంభించారు. ఇదే కాకుండా పంజాగుట్ట నాగార్జున సెక్టార్ లోని కాంప్లెక్స్ మాల్ ఓపెన్ చేశారు. ఇందులో కూడా మూడు స్క్రీన్లు ఉంటాయి. అయితే ఈ మాల్స్ ను ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ మాట్లాడుతూ  హైదరాబాద్ వంటి నగరానికి సినిమాలే ఊపిరిని ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ మాల్స్ రావడం చాలా ఆనందమన్నారు.

 ప్రజలు దూరం వెళ్లాల్సిన పని లేకుండా నార్సింగి లోనే ఆనందంగా సినిమాలు చూడవచ్చు అని తెలియజేశారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ..  వినోదం అంటే కేవలం సినిమాలే మాత్రమే కాదని, అన్ని ఆనందాలు పంచుకోవడం అంటూ మల్టీప్లెక్స్ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కంఫర్ట్ రెండు లభిస్తాయని తెలియజేశారు. అంతేకాకుండా ఈ థియేటర్లలో 800 సీట్ల సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ రెండు మల్టీప్లెక్స్ లలో ఓజి సినిమా కూడా రిలీజ్ అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: