
సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో ఓజీ సినిమా గురించి ఉన్న టాక్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా, ప్రేక్షకులు ఆ సీన్స్ గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ అయ్యాడు అంటూ ఆనందం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో ఎవ్వరూ గమనించని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అనే విషయం బయటపడ్డింది. ఇక మరో పెద్ద హైలైట్, ఈ సినిమాలో ఒక మెగా హీరో గెస్ట్ అపీరియన్స్ లో కనిపించటం బిగ్ విశేషం. సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. రామ్ చరణ్ - సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఒక సన్నివేశంలో కనిపించాడు.
కొంతమంది ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని గమనించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, "సుజిత్ ఇలా ఊహించారని ఊహించలేదు" అని చెప్పుతున్నారు. అంతేకాదు, అభిమానులు మాట్లాడుకుంటూ "ఓజీ పార్ట్ 2 లో రామ్ చరణ్ కూడా ఉండవచ్చు" కాబట్టి, ముందుగానే ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు సుజిత్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో, వీడియోలు, డిస్కషన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు అన్ని అనుకున్నట్లే అయితే ఓజి 1 కంటే ఓజీ 2 ఇంకా హిట్ అవుతుంది..ఖచ్చ్గితంగా రామ్ చరణ్ ఈ సినిమాలో ఉంటే అని మాట్లాడుకుంటున్నారు. "ఇలా, ఓజీ సినిమా తాజాగా ప్రేక్షకుల, ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ..???