
అయితే, ఒక చిన్న ట్విస్ట్ మాత్రం ఉంది. రాజా సాబ్ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి జనవరి 9న రిలీజ్ అవుతున్నప్పటికీ, తమిళనాడులో మాత్రం ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కానుంది. దానికి కారణం, అదే రోజున తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్ దళపతి నటించిన "జననాయగబ్" సినిమా కూడా విడుదల కావడం. విజయ్ దళపతి చివరి చిత్రం కావడంతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో ప్రభాస్ సినిమా ఒకేసారి విడుదలైతే పిక్ క్లాష్ తప్పదని మేకర్స్ అర్థం చేసుకున్నారు.
దీంతో నిర్మాత దిల్ రాజు స్మార్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఆ కాంపీటీషన్ తప్పించుకోవడమే కాకుండా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రన్ సాధించాలని ఉద్దేశ్యంతో రాజా సాబ్‌ను తమిళనాడులో జనవరి 10న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయాన్ని అభిమానులు కూడా పాజిటివ్‌గా స్వీకరిస్తున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రభాస్‌ను ఫుల్ ఎంటర్‌టైనింగ్ కామెడీ రోల్‌లో చూపించడమే ఈ చిత్రానికి హైలైట్‌గా మారనుంది. ట్రైలర్ చూసినవారు ఇప్పటికే "ఈసారి ప్రభాస్ ఒక కొత్త వైపు చూపించబోతున్నాడు" అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మొత్తానికి, రాజా సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనవరి 9న (తమిళనాడులో జనవరి 10న) థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందా? అన్నది చూడాలి..!!