ఆంధ్రప్రదేశ్ అమరావతితో పాటుగా రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధికి రాష్ట్రానికి గల పెట్టుబడుల కోసం (APEDB ) సంస్థతో మంత్రులు నారాయణ ,బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మంత్రులు తమ ప్రాంతానికి పెట్టుబడులకు రావాలంటే ఆహ్వానించారు.ఆదివారం ఉదయం 11:40 నిమిషాలకు దేశ రాజధాని సీయోల్ ప్రాంతంలో నామీ ల్యాండ్ సీఈవో మీర్ క్యోంగ్ తో భేటీ అయ్యారు. ఇక్కడ జరిగినటువంటి సభలో ఏపీ మంత్రులు దక్షిణ కొరియాలోని ప్రముఖ కంపెనీలతో పెట్టుబడుల కోసం చర్చించినట్లు తెలుస్తోంది.



ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సదుపాయాలను వివరిస్తూ..గత ఏడాది కాలంలో ఏపీలో 156 ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించాము. వీటితోపాటు 8 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని.. ఇది కేవలం ఒక నెంబర్ కాదు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల దారులకు గమ్యస్థానంగా మారింది ఏపీ అంటూ తెలియజేశారు. 1053K. M. తీర ప్రాంతంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి తూర్పు తీర ముఖ ద్వారంగా పని చేస్తోందని.. ఏపీలో పోర్టులు ఇప్పటికే తూర్పు తీరంలో 30% కార్గో నిర్వహిస్తున్నాయని , ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కొత్త గ్రీన్ పూల్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయిని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆరు ఆపరేషన్ ఎయిర్ పోర్ట్లు మూడు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్లు కూడా ఉన్నాయని , ఇవే కాకుండా మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయని, ఏపీలో ఇప్పటికే చాలా అభివృద్ధి చెందుతోంది ఇతర పారిశ్రామిక వాటిలలో పెట్టుబడులు పెట్టడం ఏపీ ద్వేయమని..పారిశ్రామిక అవసరాలకు 90 వేల ఎకరాల భూమిని అందించగలమంటూ మంత్రులు మాట్లాడారు.


ఆంధ్రప్రదేశ్లో 1.3 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 175 MSME  పార్కులను రెడీ చేస్తున్నాం. అభివృద్ధితో వేగంగా వెళుతున్న ఏపీలో మీరు పెట్టుబడులు పెట్టండి అంటు దక్షిణ కొరియాలోని ప్రముఖ కంపెనీలకు పిలుపునిచ్చారు. అక్కడ జరిగినటువంటి సభలో ఏపీ మంత్రులు మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: